ETV Bharat / health

ఈ లక్షణాలు మీలో కనిపిస్తే - క్యాన్సర్​కు అవకాశమంటున్న నిపుణులు! - cancer symptoms before diagnosis

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 1:23 PM IST

Updated : Sep 14, 2024, 7:15 AM IST

Cancer Signs in Body : క్యాన్సర్​.. ఈ పేరు వింటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రాణాంతాక మైన ఈ వ్యాధి బారిన పడిన వాళ్లు దీనిని ఆలస్యంగా గుర్తించువచ్చు. పరిస్థితి చేజారిన తర్వాత గుర్తిస్తే ప్రయోజనం ఉండదు. ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటే మంచిదని చాలా మంది అనుకోవచ్చు. ఇందుకు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిశితంగా గమనిస్తే ముందుస్తుగానే క్యాన్సర్​ను గుర్తించే అవకాశం ఉంటుంది. మరి క్యాన్సర్​ను ముందుగా గుర్తించే సంకేతాలు ఏంటి? వాటి పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Cancer Signs in Body
Cancer Signs in Body (ETV Bharat)

Cancer Signs in Body : క్యాన్సర్​ రావడానికి ముందుగానే శరీరం సంకేతాలు పంపుతుందని.. ఎవరికివారు వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా గుర్తిస్తే.. ఈ వ్యాధికి చికిత్స చాలా సులభం అవుతుందని.. పూర్తిగా నయమయ్యే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కాబట్టి శరీర సంకేతాలను ముందుగానే గుర్తించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆహారం తీసుకునే సమయంలో ఈ 5 లక్షణాలను గమనిస్తే.. క్యాన్సర్​ తీవ్రతరం కాకముందే గుర్తించవచ్చని చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆహారాన్ని మింగలేకపోవడం
ఆహారం తీసుకునే సమయంలో అసౌకర్యం, నొప్పి, గొంతులో ఇరుక్కున్నట్లు కొందరికి అనిపిస్తుంది. అయితే, ఈ లక్షణాలు క్యాన్సర్​కు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అమెరికన్ క్యాన్సర్​ సొసైటీ చేసిన అధ్యయనంలో తేలింది. 2022లో ప్రచురితమైన "Symptoms of Cancer"(రిపోర్ట్​) అనే అంశంపై చేసిన పరిశోధనలో ఈ విషయాన్ని కనిపెట్టారు. ఫలితంగా తల, మెడ, దవడ ప్రాంతాల్లో క్యాన్సర్​ కణితిలను పెరిగేలా ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కడుపులో మంట
చాలా మందిలో తరచుగా వచ్చే అజీర్తి సమస్య సాధారణమైనదే. కానీ, ఛాతీ, కడుపులో మంట, ఉబ్బరంగా అనిపిస్తూ.. ఎక్కువ నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ అన్నవాహిక క్యాన్సర్​కు దారితీయవచ్చని చెప్పారు.

త్వరగా కడుపు నిండిన ఫీలింగ్
క్యాన్సర్​ను గుర్తించే మరో లక్షణం త్వరగా కడుపు నిండినట్లుగా అనిపించడం. కొద్ది మోతాదులో ఆహారం తీసుకున్నా సరే.. కొందరిలో వెంటనే కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని.. ఇది అల్సర్​ లాంటి వ్యాధుల్లో కనిపించినా క్యాన్సర్​ లక్షణం కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. ఇలాంటి సమయంలోనూ వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

వాంతులు, వికారం
చాలా మందికి కొన్ని సందర్భాల్లో వాంతులు, వికారం అవుతుంటాయి. అయితే, ఫుడ్​ పాయిజన్​, గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఇలా జరిగి ఉంటుందిలే అని భావిస్తుంటారు. కానీ, ఈ లక్షణాలు కూడా పొత్తికడుపు క్యాన్సర్​, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్​లకు ముందస్తు హెచ్చరికలా భావించాలని చెబుతున్నారు.

ఆరోగ్యకర ఆహారం తీసుకున్నా సమస్యలు
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఈ జాగ్రత్తలు పాటించినా సరే.. మలబద్ధకం, డయేరియా, మలవిసర్జనలో సమస్యలతో ఇబ్బందిపడుతుంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్​కు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గుండెపోటుకు నెల ముందే బాడీ వార్నింగ్ ఇస్తుందట! ఈ 6లక్షణాలను గుర్తిస్తే సేఫ్​గా ఉంటాం!! - heart attack warning signs

ఎముకలు బలంగా ఉండాలా? రోజూ ఈ వ్యాయామాలు చేస్తే స్ట్రాంగ్​ అవుతాయ్​! - bone density exercises

Last Updated : Sep 14, 2024, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.