ETV Bharat / health

ఎక్కువ నీళ్లున్న కొబ్బరిబోండాన్ని - ఎలా గుర్తించాలి? - Identify Full Water Coconut - IDENTIFY FULL WATER COCONUT

High Water Content Coconut Buying Tips : సమ్మర్​ వేడిని కూల్ చేసే పానీయాల్లో.. కొబ్బరి బోండాం ముందు వరసలో ఉంటుంది. అయితే.. ఎక్కువగా నీళ్లున్న బోండాన్ని సెలక్ట్ చేసుకోవడం పెద్ద టాస్క్ అయిపోతుంది చాలా మందికి! మరి.. ఎక్కువగా వాటర్ ఉండే బోండాన్ని ఎలా గుర్తించాలో మీకు తెలుసా?

High Water Content Coconut Buying Tips
High Water Content Coconut Buying Tips
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 1:48 PM IST

How to Identify High Water Content Coconut : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్, కోకోనట్ వాటర్​కు మంచి డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లు కొబ్బరినీళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. నిజానికి ఎండాకాలంలో కొబ్బరినీళ్లు తాగితే.. డీహైడ్రేషన్ తగ్గడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్, జీవక్రియ​ను మెరుగుపరుస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది.

అయితే.. అంత వరకూ బాగానే ఉన్నప్పటికీ.. మంచి బోండాన్ని ఎలా సెలక్ట్ చేసుకోవాలన్నదే పెద్ద టాస్క్. అడిగినంత డబ్బు చెల్లించి కొబ్బరి బోండాం కొనుక్కెళ్తే.. తీరా అందులో తక్కువ నీళ్లు వస్తే మనసు చివుక్కుమంటుంది. సరైన కొబ్బరిబోండాం ఎంచుకోలేకపోయామని చాలా మంది బాధపడుతుంటారు. అయితే.. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే.. ఈజీగా లేత, నీరు ఎక్కువగా ఉండే కొబ్బరి బోండాన్ని గుర్తించొచ్చు అంటున్నారు నిపుణులు. మరి.. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గట్టిగా ఊపి చూడాలి : ఎక్కువ నీరు ఉన్న కొబ్బరి బోండాం ఎంచుకోవాలంటే.. మీరు బోండాం కొనే ముందు బాగా షేక్ చేయాలి. ఇలా గట్టిగా ఊపినప్పుడు నీళ్లు కదిలిన శబ్దం వస్తే దానిని తీసుకోకండి. ఎందుకంటే.. దాంట్లో తక్కువ నీరు ఉందని అర్థం. అదే.. మీరు ఎంచుకున్న బోండాం ఊపినప్పుడు ఎలాంటి సౌండ్ రాకపోతే అందులో నిండుగా నీరు ఉందని గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు.

పరిమాణం : సాధారణంగా కొబ్బరి బోండాం ముదిరే కొద్దీ దాని షేప్ పొడవుగా, దీర్ఘచతురస్రాకారంగా మారుతుంది. అలాంటి వాటిలో నీటిశాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు బోండాం కొనేటప్పుడు ఎప్పుడూ గుండ్రంగా, బంతిలా ఉబ్బినట్లు ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వీటిలో కొబ్బరి షెల్ గుండ్రంగా, పెద్ద సైజ్​లో ఉంటుంది. దాంతో వాటర్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.

కొబ్బరినీళ్లు ఏ టైమ్​లో తాగాలో తెలుసా?

కలర్ : మనం కొబ్బరిబోండాలను కొనేటప్పుడు కొన్నింటిని గమనించినట్లయితే వాటిపై ముదురు గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. అలాంటి వాటిని ఎప్పుడూ తీసుకోవద్దంటున్నారు నిపుణులు. అలాంటి వాటిల్లో నీరు చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే.. మీరు సెలెక్ట్ చేసుకునే బోండాం పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఫ్రెష్​గా ఉండేలా చూసుకోండి. అవి అధిక నీటి కంటెంట్​ను అందించే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.

వెంటనే తాగండి : మీరు కొబ్బరి బోండాం కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బోండా ఎప్పుడూ కొనుగోలు చేసినా దానిని షాపు దగ్గరే తాగండి. ఎందుకంటే వెంటనే తాగడం వల్ల కోకోనట్ వాటర్​లో ఉండే పోషకాలన్నీ మీకు పూర్తిగా అందుతాయి. అలాకాకుండా మీరు ఎక్కువ సేపు తాగకుండా ఉంచే కొద్దీ దానిలో పోషకాలు తగ్గిపోతాయంటున్నారు నిపుణులు.

ఎంపిక : కొందరు లేత కొబ్బరితో ఉండే కొబ్బరిబోండాలను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో వాటర్ కాస్త ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మరికొందరు తియ్యని రుచిని కలిగిన నీరు కావాలనుకుంటారు. ఇలాంటి వారు కాస్త ముదురు బోండాం ఎంచుకుంటారు. మీ ఇష్టాన్ని బట్టి పైన పేర్కొన్న టిప్స్​తో కొబ్బరి బోండాన్ని సెలెక్ట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొబ్బరి నీళ్లతో ఎండ వేడే కాదు.. అజీర్తి, మలబద్దకం రోగాలు దూరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.