Tips for Reduce Post Pregnancy Tummy : డెలివరీ తర్వాత వచ్చిన పొట్టను తగ్గించుకోవడానికి.. మార్నింగ్ పరిగడపున గోరువెచ్చని నీళ్లు తాగడం చాలా బాగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. నీటిలో ఒక చెంచా నిమ్మరసం, అరచెంచా తేనె కలిపి తీసుకుంటే రుచికరంగా ఉండడమే కాదు ఆరోగ్యానికీ మేలు జరుగుతుందని చెబుతున్నారు. డైలీ దీన్ని తాగడం వల్ల కొద్ది రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు.
దాల్చిన చెక్క, లవంగం మిశ్రమం : ఇది కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీ పొట్టను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని చెబుతున్నారు. రెండు లీటర్ల నీటిలో రెండు మూడు లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వరుసగా 40 రోజుల పాటు తాగడం వల్ల పొట్ట తగ్గి నాజూగ్గా తయారవ్వచ్చంటున్నారు. లవంగాలు, దాల్చిన చెక్క బదులుగా.. చెంచా చొప్పున బార్లీ, వాము వేసి తయారుచేసుకున్న మిశ్రమం కూడా చక్కగా పనిచేస్తుందని చెబుతున్నారు. డైలీ ఒక కప్పు గ్రీన్ టీ తాగినా ఫలితం ఉంటుందట.
బిడ్డకు పాలు : ప్రసవానంతరం తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా కూడా పొట్ట ఎత్తును తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. తల్లి పాలివ్వడం ద్వారా రోజుకు బాడీలో 500 క్యాలరీల దాకా ఖర్చవుతాయని చెబుతున్నారు. కాబట్టి ఇది కూడా ఒక ఉత్తమ మార్గంగా చెబుతున్నారు. 2015లో 'Obesity Reviews' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. బిడ్డకు ఎక్కువసేపు పాలు ఇచ్చే మహిళలు, తక్కువసేపు పాలు ఇచ్చే మహిళల కంటే ఎక్కువ బరువు కోల్పోయారని వెల్లడైంది. ఈ పరిశోధనలో పాల్గొన్న యూకేలోని 'లీడ్స్ విశ్వవిద్యాలయం ప్రొపెసర్ డాక్టర్ జె.ఎస్. జెబ్' బిడ్డకు పాలివ్వడం వల్ల శరీరంలోని కొవ్వు శాతం తగ్గుతుందని పేర్కొన్నారు.
రోజులో ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొంటే గర్భం వస్తుంది? - రీసెర్చ్‌లో ఆసక్తికర విషయం!
పండ్లు, కూరగాయలు : కొన్ని పండ్లను డైట్లో చేర్చుకోవడం ద్వారా ప్రసవానంతరం పొట్టను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అందులో ముఖ్యంగా యాపిల్ తీసుకోవడం మంచిదట. దీంతోపాటు ఆయా సీజన్లలో లభించే తాజా పండ్లు, కాయగూరల్ని డైలీ డైట్లో భాగం చేసుకోవాలంటున్నారు.
మరికొన్ని విషయాలు :
- డెలివరీ తర్వాత మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఎదురవడం సహజం. వీటి కారణంగా పొట్ట తగ్గడానికి బదులుగా మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.
- కాబట్టి ఎలాంటి ఒత్తిడీ దరిచేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- సిజేరియన్, నార్మల్.. వీటిలో మీకు ఏ పద్ధతిలో ప్రసవం జరిగినా ఆరు నెలల వరకు బరువులెత్తడం, త్వరగా పొట్ట తగ్గాలని బలవంతంగా వ్యాయామాలు చేయడం అస్సలు మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- డెలివరీ తర్వాత పొట్ట తగ్గించుకునే విషయంలో.. ఎప్పుడు వ్యాయామం మొదలుపెట్టాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఎంతసేపు చేయాలి? వంటి విషయాలన్నీ సంబంధిత నిపుణులను సంప్రదించాకే మొదలుపెట్టడం మంచిది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
Sex During Pregnancy : గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ చేయవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?