Best Oils for Double Hair Growth: ప్రస్తుత కాలంలో చాలా మంది అందంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. అయితే అందం విషయంలో జుట్టు కూడా కీలకమైనదే. కానీ ఈరోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే వివిధ రకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జుట్టు రాలిపోవడం, పొడిబారిపోవడం, నెరిసిపోవడం, చుండ్రు.. ఇలా పలు రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్ కేర్ ఉత్పత్తులు, ఆయిల్స్‌ను యూజ్ చేస్తుంటారు. ఇవన్నీ ట్రై చేసినా ఫలితం అంతంతమాత్రమే అని బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ సహజ నూనెలు ట్రై చేస్తే జుట్టు పెరగడాన్ని ఎవరూ ఆపలేరని అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ నూనెలేంటో ఈ స్టోరీలో చూద్దాం..
కలోంజి నూనె: కలోంజి నూనె ఆరోగ్యపరంగానే కాకుండా జుట్టు పెరగడంలో కూడా సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇది ఎలా చేయాలంటే..
- ముందుగా ఒ కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను మంటపై వేడి చేయాలి.
- అందులో ఒక చెంచా కలోంజి గింజలు వేసి ఉడికించాలి.
- తర్వాత ఈ నూనెను వడకట్టి సీసాలో స్టోర్ చేసుకోవాలి.
- ఈ నూనె జుట్టుకు జింక్, ఐరన్, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. పెరగుదలను ప్రోత్సహిస్తుంది.
జుట్టు రాలడం నుంచి చుండ్రు వరకు - ఉల్లి నూనెతో అన్నీ పరార్! - Onion Oil Benefits
బాదం నూనె: పొడవాటి, మందమైన జుట్టు కోసం వారానికి రెండు సార్లు బాదం నూనెతో తలకు మసాజ్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని తద్వారా జుట్టు పెరుగుదల బాగుంటుందని అంటున్నారు. అలాగే బాదం నూనెతో జుట్టు మూలాలు బలంగా మారుతాయి. జుట్టు మృదువుగా మారుతుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలు పోతాయి. చివర్లు చీలిపోవడంతో పాటు జుట్టు చిట్లడమనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
2015లో "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ" లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం బాదం నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని, జుట్టు ధృడంగా మారడంలో సాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ నగరంలోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో చర్మవ్యాధి విభాగంలోని ప్రొఫెసర్ డాక్టర్ జాన్ డబ్ల్యూ. హా పాల్గొన్నారు.
కరివేపాకు నూనె : కరివేపాకు ఆకులు జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండటమే కాకుండా జుట్టు చిన్నతనంలోనే నెరసిపోయే అవకాశాలను కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం..
- 100 గ్రాముల నూనెలో కొన్ని కరివేపాకులను వేసి బాగా ఉడికించాలి.
- చల్లారిన తరువాత వడగట్టి గాజు సీసాలో పెట్టుకోవాలి.
- ఈ నూనెను ఇతర నూనెల మాదిరిగా తలకు మసాజ్ చేయడానికి ఉపయోగించవచ్చు.
చిన్న పిల్లల జుట్టుకు ఏ నూనె రాస్తున్నారు? - వీటిని ట్రై చేయండి!
ఉల్లిపాయ నూనె: ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉల్లిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. జుట్టు సమస్యలను దూరం చేయడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని, ఇవన్నీ జుట్టు రాలడాన్ని అరికట్టి.. హెయిర్ ఒత్తుగా, బలంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం..
- చిన్న ఉల్లిపాయలను నూనెలో వేసి బాగా ఉడికించి చల్లారిన తరువాత వడగట్టి గాజుసీసాలో భద్రపరుచుకోవాలి.
- ఈ నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు రాత్రి పూట జుట్టుకు పెట్టుకుని తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తుండాలి.
- ఇలా చేస్తుంటే జుట్టు రెండింతలు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఆయిల్ రాసినా మీ జుట్టు గడ్డిలా ఎండిపోతోందా? - ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి!
కొబ్బరి నూనె ఇలా వాడితే - అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!