ETV Bharat / health

పచ్చి మామిడికాయలు తింటే వెయిట్​ లాస్​- ఈ లాభాలు తెలుసా? - Benefits of Eating Raw Mango - BENEFITS OF EATING RAW MANGO

Benefits of Eating Raw Mango : మామిడిపండ్లు అంటే ఇష్టపడని వారుంటారా! వేసవి కాలం ఉన్నన్ని రోజులు తప్పకుండా వీటిని తింటుంటాం. అయితే మామిడి పండ్లు మాత్రమే కాదు, పచ్చివి తినడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలున్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Benefits of Eating Raw Mango
Benefits of Eating Raw Mango
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 1:58 PM IST

Benefits of Eating Raw Mango : మూమూలు పండ్లతో పోల్చితే సీజనల్​గా దొరికే వాటికి ధరతో పాటు డిమాండ్ కూడా ఎక్కువే. ఎందుకంటే తక్కువ కాలం లభించే ఈ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ. ఏ సీజన్​లో దొరికే పండ్లను ఆ కాలంలోనే తప్పకుండా తినాలని నిపుణులు కూడా చెబుతుంటారు. అలాంటి వాటిల్లో వేసవి కాలంలో దొరికే మామిడిపండ్లకు డిమాండ్ మరీ ఎక్కువ. రకరకాలుగా దొరికే వీటిని ఇష్టపడని వారంటూ లేకపోవడం కూడా ఇందుకు కారణం. మామిడి పండ్లు మాత్రమే కాదు.. పచ్చి మామిడికాయలు కూడా ఇష్టపడుతుంటారు. పచ్చి మామిడికాయను పప్పులో వేసుకోవడం, పచ్చడి చేసుకుని తినడం లాంటివి చేస్తుంటాం. అంతే కాదు పచ్చి మామిడికాయను తినడం వల్ల కలిగే లాభాలు కూడా ఎక్కువేనని వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

విటమిన్-సీ
పచ్చి మామిడికాయల్లో విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొల్లాజెన్ ఉత్పత్తికి ఇది బాగా సహాయపడుతుంది. పచ్చి మామిడికాయలను తినడం వల్ల వేసవి కాలంలో వచ్చే చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండచ్చట.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది
మామిడికాయల్లోని పచ్చిదనం జీర్ణ ఎంజైముల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడి అజీర్తి, ఉబ్బరం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. పచ్చిమామిడికాయలను నేరుగా తినడం వల్ల వేసవి కాలంమంతా జీర్ణకోశ సమస్యలకు దూరంగా ఉండచ్చు.

శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది
పచ్చి మామిడికాయల్లో శరీరాన్ని చల్లబరిచే లక్ఝణాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచి వేసవి వేడి కారణంగా వచ్చే చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పచ్చి మామిడికాయలతో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది. వేసవి వేడి నుంచి కాపాడుకునేందుకు చక్కగా ఉపయెగపడుతుంది.

రోగనిరోధక శక్తి
విటమిన్-సీతో పాలు విటమిన్ ఏ,ఈ లాంటి పోషకాలు, బీటా కెరోటీన్, క్వెర్సెసిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పచ్చి మామిడికాయలో మెండుగా లభిస్తాయి. వీటిని తరచుగా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

బరువు నియంత్రణ
పచ్చి మామిడికాయల్లో తక్కువ కేలరీలు, ఎక్కువ డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారంగా చెప్పొచ్చు. పచ్చి మామిడికాయలను తినడం వల్ల కడుపుకు తృప్తిగా ఉండి ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. ఫలితంగా తక్కువ తింటారు, బరువు పెరగకుండా ఉంటారు.

చిగుళ్ల సమస్యలకు చెక్
యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉండే పచ్చి మామిడికాయలు నోట్లోని బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి బాగా సహాయపడుతుంది. దంతక్షయం, దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు లాంటి వాటిరి చక్కటి నివారణగా పనిచేస్తాయి. పచ్చి మామిడికాయలను నమలడం, రసాన్ని తాగడం వల్ల నోటి పరిశుభ్రతను కాపాడుకోవచ్చు.

వడదెబ్బ
పచ్చి మామిడికాయలు శీతలీకరణ స్వభావం కలిగి ఉంటాయి. వేసవి కాలంలో వచ్చే వడదెబ్బ, హీట్‌స్ట్రోక్ లక్షణాలను తగ్గించగలవు. పచ్చి మామిడికాయలు తినడం, వాటి రసం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి సూర్యరశ్మి వల్ల కలిగే తలనొప్పి, తల తిరగడం, వికారం నుండి ఉపశమనం లభిస్తుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'వెజిటెబుల్ వయాగ్రా'గా బీట్​రూట్! నిజమెంత? ఎలాంటి లాభాలు ఉంటాయి? - Beetroot Benefits In Telugu

విపరీతంగా జుట్టు ఊడిపోతోందా? ఇంట్లోని ఈ ఐటమ్స్​తో హెయిర్​ లాస్​కు చెక్​ పెట్టండిలా! - Tips To Stop Hair Fall

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.