Benefits Of Cooking In Brass Utensils : కొన్ని లోహాలతో తయారుచేసిన పాత్రలలో వండిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. అలాంటి వాటిల్లో "ఇత్తడి" కూడా ఒకటని చెబుతున్నారు. ఇత్తడి పాత్రలపై సూక్ష్మజీవులు ఎక్కువసేపు జీవించలేవట. అలాగే ఆహారపదార్థాలు త్వరగా వేడి తగ్గకుండా ఉంటాయట. ఈ పాత్రలలో టీ పెట్టుకొని తాగడం, ఆహార పదార్థాలు వండుకొని తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయంటున్నారు. అలాంటి వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే..
ఫుడ్ టేస్ట్ పెరుగుతుంది : వంటలకు ఇత్తడి పాత్రలను యూజ్ చేయడం వల్ల వాటి రుచి పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వీటిల్లో వంట చేస్తున్నప్పుడు ఆ పాత్రల నుంచి సహజ నూనెలు రిలీజ్ అవుతాయట. ఇవి సహజంగా ఆహారం రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యానికీ మేలు చేస్తాయని చెబుతున్నారు.
జీర్ణ ఆరోగ్యానికి మేలు : టీ, ఇతర వంటకాలకు ఇత్తడి గిన్నెలను వాడడం వల్ల జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రోహిణి పాటిల్. ఎందుకంటే.. ఇత్తడి పాత్రలలో వండేటప్పుడు వాటి నుంచి రిలీజ్ అయిన పోషకాలు మనం తినే ఆహారంతోపాటు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయని చెబుతున్నారు. తద్వారా ఈ పోషకాలు ఆహారాన్ని బాగా జీర్ణం చేసి మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది : రాగి పాత్రల(Copper Utensils) మాదిరిగానే ఇత్తడి పాత్రలలో వాటర్ స్టోర్ చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు డాక్టర్ రోహిణి. రాత్రంతా ఇత్తడి పాత్రలో ఉంచిన నీటిని మార్నింగ్ తాగడం వల్ల బాడిలో రోగనిరోధక శక్తి బలపడుతుందని చెబుతున్నారు. అలాగే.. ఈ పాత్రలలో ఆహారాలను వండుకొని తినడం కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుందంటున్నారు.
చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది : ఇత్తడి పాత్రలు చర్మ ఆరోగ్యానికి సైతం మేలు చేస్తాయంటున్నారు డాక్టర్ రోహిణి పాటిల్. రోజు టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు ఈ పాత్రలను వాడటం, ఇతర వంటకాల కోసం వీటిని యూజ్ చేయడం వల్ల మొటిమలు, ముడతలు వంటి చర్మ సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.
రక్త శుద్ధికి తోడ్పడతాయి : ఇత్తడి పాత్రలలో వండిన ఆహారం లేదా టీలో జింక్ ఎక్కువ మొత్తంలో ఉంటుందంటున్నారు. ఇది శరీరంలో రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే.. ఈ పాత్రలలో వండిన ఆహారాన్ని ఆహారం తినడం ద్వారా లభించే పోషకాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతాయంటున్నారు డాక్టర్ రోహిణి.
ఇవి వండ కూడదు : గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. ఇత్తడి పాత్రల్లో నిమ్మకాయ, టమాటా వంటి ఆమ్ల గుణాలు ఉన్న ఫుడ్స్ ఎప్పుడూ వండవద్దు. ఎందుకంటే.. వాటిని ఈ పాత్రలలో వండి తీసుకోవడం శరీరానికి హాని కలిగిస్తుందంటున్నారు నిపుణులు.
NOTE : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
రాగి పాత్రలు సీల్ తీసిన వాటిలా మెరిసిపోవాలా? - ఇలా చేయండి!
ఎంత తోమినా గిన్నెల మీద జిడ్డు పోవడం లేదా? - ఇలా చేస్తే చాలు చిటికెలో మాయం!