Benefits Of Chewing Curry Leaves With Empty Stomach : ఉదయాన్నే కరివేపాకులను నమలడం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుందని అంటున్నారు. అలాగే.. అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు.
విషతుల్యాలను తొలగిస్తుంది :
కరివేపాకులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరగడం నుంచి బరువు తగ్గేవరకు - కివీతో ప్రయోజనాలు ఎన్నో!
చక్కెర స్థాయులు అదుపులో :
మార్నింగ్ ఖాళీ కడుపుతో కొన్ని కరివేపాకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల షుగర్ బాధితులు బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా చూసుకోవచ్చంటున్నారు. 2013లో "Journal of Clinical and Translational Research" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. టైప్ 2 మధుమేహం ఉన్నవారు మూడు నెలల పాటు రోజుకు రెండుసార్లు 10 కరివేపాకు ఆకులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డయాబెటాలజీ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ రావు పాల్గొన్నారు.
ఆరోగ్యకరమైన బరువు :
కరివేపాకులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. అలాగే అతిగా తినడాన్ని తగ్గించుకోవచ్చు. ఫలితంగా ఆరోగ్యకరమైన బరువును కొనసాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ తగ్గాలని మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ - ఈ నేచురల్ పద్ధతులతో ఇట్టే కరిగిపోద్ది!
జుట్టు కుదుళ్లు దృఢంగా :
ఇటీవల కాలంలో కాలుష్యం, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. ఇలాంటి వారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకులను నమలడం ద్వారా హెయిర్ ఫాల్‌ని తగ్గించుకోవచ్చట. కరివేపాకులలోని బీటా-కెరోటిన్, ప్రొటీన్ల వంటి పోషకాలు జుట్టు కుదుళ్లకు లోపలి నుంచి పోషణను అందించి బలంగా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నోటి దుర్వాసనకు చెక్ :
నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు మార్నింగ్ కరివేపాకులను నమలడం ద్వారా బ్యాడ్ బ్రీత్‌కి కూడా చెక్ పెట్టొచ్చని అంటున్నారు. వీటిని తినడం ద్వారా తాజా శ్వాసను పొందవచ్చని సూచిస్తున్నారు.
- అలాగే కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
- రోజూ కరివేపాకులను తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
- కరివేపాకులు నమలడానికి ఇబ్బంది పడితే.. పొడి, హెర్బల్ టీల రూపంలో కూడా తీసుకోవచ్చు.
- లేదంటే.. కొన్ని ఆకులను మిక్సీ పట్టుకొని, గ్లాసు నీటిలో కలిపి తాగొచ్చు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.