Beetroot Benefits In Telugu : శరీరానికి శక్తినిచ్చే దుంపజాతి ఆహార పదార్థాల్లో బీట్‌రూట్ ప్రముఖమైనది. కంటికి ఇంపుగా కనిపించడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందీ బీట్‌రూట్. బీట్‌రూట్‌ను తినొచ్చు, జ్యూస్ చేసుకుని తాగొచ్చు, కూరగానూ వండుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో బీట్‌రూట్ వెజిటేబుల్ వయాగ్రా పనిచేస్తుందని వార్తలు వచ్చాయి. బీట్‌రూట్ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని కథనాలు వెలువడ్డాయి. ఫలితంగా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బీట్‌రూట్ ధర విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే బీట్రూట్పై వచ్చిన కథనాలపై యూకే టీవీ డాక్టర్ మైఖేల్ మోస్లీ క్లారిటీ ఇచ్చారు.
బీట్‌రూట్ ప్రత్యేకత ఏమిటి?
బీట్‌రూట్ కూడా బెర్రీలు, ఆకు కూరల్లానే ఒక సూపర్ ఫుడ్. ఇందులో విటమిన్లు బి, సి, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది బీట్‌రూట్‌ను తమ వంటల్లో భాగం చేసుకుంటారు.
బీట్‌రూట్ నిజంగా వెజిటెబుల్ వయాగ్రానా?
రోమన్లు బీట్‌రూట్, దాని జ్యూస్ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని నమ్మేవారట. అప్పట్లో బీట్‌రూట్‌ను విరివిగా వాడేవారని చెబుతుంటారు. కానీ బీట్‌రూట్ లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు.
బీట్రూట్లో ఉన్న బ్యాక్టీరియాను మనం తిన్నప్పుడు ఎంజైమ్లతో రసాయన చర్య జరిపి నైట్రేట్‌ను నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచడం, శృంగారం చేస్తున్నప్పుడు రక్త ప్రవాహాన్ని నియంత్రించి టెస్టోస్టెరాన్ వృద్ధి చేస్తుంది. ఫలితంగా బీట్‌రూట్ కొంతమేర పురుషులు, మహిళల్లో లైంగిక చర్యపై ప్రభావం చూపుతుంది. అంతేగానీ లైంగిక జీవితాన్ని మార్చేస్తుందని కచ్చితంగా చెప్పలేం.
బీట్‌రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బీట్‌రూట్ క్యాన్సర్, మధుమేహాన్ని కట్టడి చేస్తుంది. బీట్‌రూట్‌ను సప్లిమెంట్ల రూపంలో లేదా సాధారణంగా తిన్నా ప్రయోజనం ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి బీట్‌రూట్ బాగా ఉపయోగపడుతుంది.
1. పచ్చి బీట్‌రూట్ - పచ్చి బీట్‌రూట్‌ను తురుము లేదా సలాడ్‌ల రూపంలో తినొచ్చు. శాండ్‌విచ్‌లుగా చేసుకొని ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
2. వండిన బీట్‌రూట్ - బీట్‌రూట్‌ను ఆవిరిపై ఉడికించి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
3. బీట్‌రూట్ రసం - బీట్‌రూట్‌ను జ్యూస్‌గా చేసుకొని తాగవచ్చు. అదనపు రుచి కోసం బీట్‌రూట్ జ్యూస్‌లో ఇతర పండ్లు, కూరగాయల రసాన్ని కలుపుకోండి.
4. స్మూతీస్ - మీకు ఇష్టమైన స్మూతీకి బీట్‌రూట్ జోడించండి.
5. సూప్‌లు - బీట్రూట్తో సూప్ చేసుకుని తీసుకోవచ్చు.
షుగర్ పేషెంట్లు బెండకాయ తింటే మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే! - Ladies Finger For Diabetes