ETV Bharat / health

ముఖంపై మచ్చలకు ఆయుర్వేదం - ఈ ఫేస్ ప్యాక్​తో తగ్గిపోతాయట! - Ayurvedic Face Pack for Dark Spots

Ayurvedic Face Pack for Dark Spots : ముఖంపై మచ్చల వల్ల చాలా మంది నలుగురులోకి వెళ్లడానికి ఇబ్బందిపడుతుంటారు. అయితే ఇకపై అలాంటి బాధ లేకుండా కేవలం ఇంట్లోని పదార్థాలతోనే మంచి ఫేస్ ప్యాక్​తో పాటు కషాయాన్ని తయారు చేసుకోని మచ్చలను తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Skin Dark Spots Ayurvedic Treatment
Skin Dark Spots Ayurvedic Treatment (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Aug 24, 2024, 3:23 PM IST

Updated : Sep 14, 2024, 10:19 AM IST

Ayurvedic Face Pack for Dark Spots : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు. కానీ, మారిన జీవనశైలి చర్మంపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. దీంతో చాలా మంది ముఖంపై మచ్చలు సహా రకరకాల చర్మ సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇక వీటిని తగ్గించుకోవడానికి డాక్టర్లను సంప్రదించడం, ఏవేవో మందులు వాడటం, చిట్కాలు పాటించడం చేస్తుంటారు. అయినా సమస్య తగ్గుతుందా అంటే అదీ లేదు. అయితే ఇటువంటి సమస్యతో బాధపడేవారు ఇంటి వద్దే ఈజీగా ఫేస్​ ప్యాక్​తో పాటు ఓ కషాయం తయారు చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిని వాడడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్​ గాయత్రీ దేవి చెప్పారు. ఇంతకీ ఆ మాస్క్ ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? కషాయం కోసం కావాల్సిన పదార్థాలు ఏంటి? దీని ఎలా తయారు చేసుకోవాలి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఫేస్ ప్యాక్ కోసం కావాల్సిన పదార్థాలు

  • అర చెంచా యష్టిమధు పొడి
  • అర చెంచా లోధ్ర పొడి
  • ఒక చెంచా బార్లీ పొడి
  • కొద్దిగా పుల్లటి పెరుగు

తయారీ విధానం

  • ముందుగా బార్లీ గింజలను మెత్తగా పిండిలా చేసుకుని ఓ గిన్నెలో పోసుకోవాలి
  • ఆ తర్వాత అందులోనే లోధ్రపొడి, యష్టిమధు చూర్ణాన్ని కలపాలి.
  • అనంతరం దీనిని పేస్ట్​లాగా చేసుకునేందుకు కొద్దిగా పుల్లటి పెరుగు ఇందులో కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్​లాగా తయారు చేసుకుని మచ్చలు ఉన్న ప్రదేశంలో లేపనంలా రాసుకోవాలి.
  • ఇలా ప్రతిరోజు 15 నిమిషాల పాటు ముఖానికి అప్లై చేసి తర్వాత కడిగిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

లాభాలు:

బార్లీ: బార్లీకి మచ్చలను తగ్గించే సహజగుణం ఉంటుందని ఆయుర్వేద నిపుణలు చెబుతున్నారు.

లోధ్ర: లోధ్ర అనేది మచ్చలు తగ్గించడమే కాకుండా ముఖాన్ని కాంతివంతంగా చేయడంలోనూ సాయం చేస్తుందని తెలిపారు.

యష్టిమధు: యష్టిమధు చర్మానికి మంచి కాంతిని ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదే కాకుండా మచ్చలు పోవడానికి సహాయం చేస్తుందని వివరించారు.

ముఖంపై మచ్చలు తగ్గించుకునేందుకు కషాయం:

కావాల్సిన పదార్థాలు

  • ఒక చెంచా వట్టి వేర్లు చూర్ణం
  • ఒక చెంచా చందనం చూర్ణం
  • ఒక చెంచా సుగంధి పాలు
  • ఒక చెంచా తేనె

తయారీ విధానం

  • ముందుగా స్టౌ వెలిగించి ఓ కడాయిలో గ్లాస్​ నీటిని పోయాలి.
  • ఆ తర్వాత అందులో వట్టి వేర్ల చూర్ణం, సుగంధి పాలను వేసుకోవాలి.
  • అనంతరం ఈ నీరు మరుగుతున్నప్పుడు కాకుండా దించేముందు చందనం చూర్ణాన్ని వేసుకోవాలి. (చందనాన్ని మరిగించడం వల్ల అందులోని ఔషధ గుణాలు ఆవిరైపోతాయట)
  • ఈ ఔషధాన్ని ఓ గిన్నెలో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత చెంచా తేనెను కలపాలి.
  • మచ్చలను తగ్గించే కషయాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలని నిపుణులు సూచించారు.
  • దీనిని 30-40 మిల్లీ లీటర్ల పరిమాణంలో ఉదయం, సాయంత్రం తీసుకోవాలని చెప్పారు.
  • ఇలా కనీసం 2-3 నెలల పాటు తీసుకోవడం వల్ల మచ్చలు తగ్గి చర్మమంతా ఒకే రంగులోకి వస్తుందని నిపుణులు తెలిపారు.

వట్టి వేర్లు: వట్టి వేర్లకు మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్పారు. ఇది చర్మపు రంగును సాధారణంగా మారుస్తుందని తెలిపారు.

సుగంధి పాలు: సుగంధి పాలు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా పిత్త దోషాన్ని తగ్గించి చర్మంపై ఉన్న మచ్చలను తగ్గిస్తుందని వివరించారు.

చందనం: చందనం చర్మానికి ఎంత మంచి ఔషధమనే విషయం చాలా మందికి తెలుసు. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

స్మోకింగ్​, డ్రింకింగ్​ కాదు - కాలేయాన్ని ఎక్కువ దెబ్బతీసే ఆహారాలు ఇవే! మీకు తెలుసా? - Foods to Avoid Keep Liver Healthy

హాయిగా నిద్రపోవాలంటే - ఈ ఆహారాలు మీ లిస్ట్​లో ఉండాల్సిందే! - Best Foods to reduce Sleeplessness

Last Updated : Sep 14, 2024, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.