ETV Bharat / health

అలర్ట్​ - బ్రేక్​ఫాస్ట్​లో ప్రొటీన్​ షేక్స్​ తీసుకుంటున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - Protein Shakes in Breakfast is Good - PROTEIN SHAKES IN BREAKFAST IS GOOD

Protein Shakes: మీరు ప్రతిరోజు బ్రేక్​ఫాస్ట్​లో ప్రొటీన్ షేక్​ను తీసుకుంటున్నారా? మరి ఉదయాన్నే ప్రొటీన్ షేక్​ను తీసుకోవడం సరైనదేనా? ఒకవేళ తీసుకుంటే ఎలాంటి ప్రొటీన్ షేక్​లను తీసుకోవడం మంచిది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Protein Shakes in Breakfast is Good or Not
Protein Shake Breakfast Replacement (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Sep 3, 2024, 12:53 PM IST

Protein Shakes in Breakfast is Good or Not? ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ప్రొటీన్​ షేక్​లు తీసుకోవడం విపరీతంగా పెరిగిపోయింది. శక్తికి, కండరాల పెరుగుదల, బరువు తగ్గడం, పెరగడం లాంటి సమస్యల పరిష్కారానికి ప్రొటీన్​ షేక్​ను ఆప్షన్​గా భావిస్తున్నారు. అయితే చాలా మంది బ్రేక్​ఫాస్ట్​లో ప్రొటీన్​ షేక్​లను తీసుకుంటుంటారు. మరి ఇలా బ్రేక్​ఫాస్ట్​లో ప్రొటీన్ షేక్​ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదా? అన్న విషయాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఉదయాన్నే ప్రొటీన్​ షేక్​ తీసుకోవడం మంచిదా?: ప్రతిరోజు బ్రేక్​ఫాస్ట్​లో ప్రొటీన్​ షేక్​ను తీసుకోవడం సురక్షితమే కాకుండా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఉదయాన్నే ఎక్కువ ప్రొటీన్లను తీసుకోవడం వల్ల ఆ రోజంతా యాక్టివ్​గా ఉండేలా చేస్తుందని అంటున్నారు. అయితే, బ్రేక్​ఫాస్ట్​లో ప్రొటీన్​ షేక్​లు మంచివి కదా అని విపరీతంగా తీసుకోవద్దని.. అలాగే సరైన ప్రొటీన్ షేక్​లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.

2020లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. బ్రేక్​ఫాస్ట్​లో ప్రొటీన్ షేక్స్(National Library of Medicine రిపోర్ట్​) తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, కండరాలు బలంగా మారేందుకు ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కెనడాలోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీలో కినిసాలజీ విభాగంలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ Daniel W. West పాల్గొన్నారు.

ఏ ప్రొటీన్ ఉత్తమం?: మీ ప్రొటీన్ అవసరాలపై ఆధారపడి మీకు ఏ ప్రొటీన్ షేక్ బెస్ట్​ అనేది తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇందులో రెండు రకాలు ప్రొటీన్​ పౌడర్లు ఉన్నాయని.. ప్రతి రకం విభిన్న ప్రయోజనాలను అందిస్తాయని అంటున్నారు.

వే ప్రొటీన్​ : ఆవు పాల నుంచి తీసే ఈ వే ప్రొటీన్​ను చాలా మంది వినియోగిస్తారు. ఇది త్వరగా శరీరంలో కలిసిపోయి కండరాల బలోపేతానికి కృషి చేస్తుందని తెలుపుతున్నారు. ఈ వే ప్రొటీన్​ మార్కెట్​లో చాలా రకాలుగా అందుబాటులో ఉండగా.. వీటిలో ప్రొటీన్, కొవ్వులు ఒక్కోదానిలో వేర్వురుగా ఉంటాయంటున్నారు. అయితే, మీరు శరీరంలో కొవ్వు తగ్గాలని చూస్తుంటే మాత్రం వే ప్రొటీన్​ బెస్ట్ ఆప్షన్​గా చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే ఇందులో ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉంటాయని వివరిస్తున్నారు.

మొక్కల ఆధారిత ప్రొటీన్లు : అయితే, మీరు మొక్కల ఆధారిత ప్రొటీన్ల కోసం చూస్తుంటే సోయా, బఠానీ, బియ్యం మంచి ప్రత్యామ్నాయాలని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్​ అధికంగా ఉండమే కాకుండా కొవ్వులు తక్కువగా ఉంటాయని తెలుపుతున్నారు. జంతువుల ఉత్పత్తులను తీసుకోకుండా ప్రొటీన్లు కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్​ అని సూచిస్తున్నారు.

అయితే.. బయట మార్కెట్​లో లభించే ప్రొటీన్​ పౌడర్స్​ లేదా ప్యాకెట్స్​లలో కొన్ని కెమికల్స్​ కలిసే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఆరోగ్యకరమైన ప్రొటీన్​ షేక్స్​ కావాలంటే వాటిని ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్​ చేసుకోవడం మంచిదంటున్నారు. అలాగే కొన్ని ఆహారా పదార్థాలను ప్రొటీన్​ పౌడర్లకు ప్రత్యామ్నాయాలుగా చెబుతున్నారు. అవేంటంటే..

శనగలు(పుట్నాలు) : సహజంగా ప్రొటీన్ తీసుకోవాలని అనుకునేవారికి శనగలు మంచిగా ఉపయోగపడతాయంటున్నారు. ఈ శనగల పిండిని పాలు లేదా నీటిలో కలిపి ఈజీగా తీసుకోవచ్చని వివరిస్తున్నారు.

హోమ్​ మేడ్​ ప్రొటీన్ పౌడర్ : ఈ ప్రొటీన్ షేక్​ను గింజలు, విత్తనాల మిశ్రమంతో తయారు చేస్తారని చెబుతున్నారు. దీని వల్ల ప్రొటీన్ పౌడర్​ను నిల్వ చేసే ప్రిజర్వేటివ్స్, రసాయనాల బారిన పడకుండా ఉండొచ్చని తెలుపుతున్నారు.

మొలకెత్తిన విత్తనాలు, పప్పులు : నానబెట్టిన విత్తనాలు, పప్పుల్లో పుష్కలంగా ప్రొటీన్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని సలాడ్​, సూప్​లలో సులభంగా కలుపుకోవచ్చని తెలిపారు.

పనీర్ :​ ఇందులో ప్రొటీన్ అధికంగా ఉంటుందని.. వివిధ అల్పాహారాల్లో దీనిని కలుపుకోవచ్చని వివరిస్తున్నారు.

పీనట్ బటర్ : మీరు రుచితో పాటు ప్రొటీన్ల కోసం చూస్తుంటే పీనట్ బటర్​ మంచి ఆప్షన్. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే పీనట్ బటర్​ను శాండ్​విచ్​ లేదా సూప్​లలో కలుపుకోవచ్చని తెలిపారు.

సోయా ఉత్పత్తులు : సోయా పాలు ప్రొటీన్ షేక్​లకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చని చెబుతున్నారు. ఇక చివరిగా బ్రేక్​ఫాస్ట్​లో కేవలం ప్రొటీన్​ షేక్స్​ మాత్రమే తీసుకోకుండా.. ఇతర పోషకాహారాలతో కలిపి ప్రొటీన్​ షేక్స్​ తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అదే పనిగా చెప్పులు, షూలు వేసుకుంటున్నారా? - ఈ సమస్యలు ఎటాక్​ చేసే ఛాన్స్​! - Side Effects of Wearing Shoes

మీలో ఈ 5 లక్షణాలు ఉన్నాయా? - అయితే క్యాన్సర్​ వచ్చే ఛాన్స్ ఉన్నట్టే! - cancer symptoms before diagnosis

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.