Best Foods to Keep Your Skin Acne Free : సౌందర్యపరంగా చాలా మందిని ఇబ్బందిపెట్టే చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. అయితే, మనం తీసుకునే ఆహారం ద్వారా మొటిమలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. మరి, మొటిమలు(Pimples).. రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు : చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాంటీఆక్సిడెంట్లు కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఇందుకోసం.. బెర్రీలు, సిట్రస్ పండ్లు, గుమ్మడికాయ, బొప్పాయి, పైనాపిల్, యాపిల్, స్ట్రాబెర్రీలు వంటి కొన్ని రకాల పండ్లు, కూరగాయలను మీ డైట్లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు : ముఖంపై మొటిమలు రావడానికి కారణమయ్యే 'సెబమ్' ఉత్పత్తిని అరికట్టే సామర్థ్యం ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల్లో ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి ఒమేగా-3 ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ మీ డైట్లో ఉండేలా చూసుకోవాలంటున్నారు. చేపలు, ఆకుకూరలు, వాల్‌నట్స్, చియా విత్తనాలు, ఆలివ్‌నూనె, బీన్స్, గుడ్లు, అవిసె గింజల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి.
2018లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకునేవారిలో మొటిమల సమస్య తక్కువగా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టౌలౌస్‌కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ యూసఫ్ గ్రాంట్-బెకెల్ పాల్గొన్నారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు మొటిమల సమస్య తగ్గించడంతోపాటు చర్మ సంరక్షణకు చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
తగినంత వాటర్ తాగడం : చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే అన్నిటికంటే కీలకమైనది వాటర్ అని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ బాడీలో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే రోజూ తగినంత వాటర్ తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లి మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి డైలీ కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సమ్మర్లో ఇవి తినండి - మీ చర్మం పాలరాయిలా మెరిసిపోతుంది! - Best Foods for a Glowing Skin
డైరీ ఫుడ్స్ తక్కువగా : డైరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొటిమలు పెరుగుతాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి.. పాల ఉత్పత్తులను తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటికి బదులు ఓట్స్, కొబ్బరినీళ్లు, బాదం పాలను మీ డైట్లో చేర్చుకోవడం మంచిదంటున్నారు.
వీటికి దూరంగా : స్పైసీ ఫుడ్స్, కెఫిన్, చాక్లెట్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు వంటివి మొటిమల సమస్యను తీవ్రతరం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి, మొటిమలు రాకుండా ఉండాలంటే ఇలాంటి ఫుడ్స్‌కు వీలైనంత దూరంగా ఉండడం మంచిది అంటున్నారు.
అలాగే.. చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండే ఫుడ్స్‌కు కూడా దూరంగా ఉండాలంటున్నారు. ఇవి చర్మం పైన ఉండే స్వేద రంధ్రాలను మూసేసి, వ్యర్థ పదార్థాలు చెమట రూపంలో బయటకు పోకుండా అడ్డుకుంటాయి. అందుకే.. మొటిమల సమస్యతో బాధపడేవారు చక్కెర శాతం తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చంటున్నారు నిపుణులు. వీటితో పాటు వేళకు నిద్రపోవడం, కనీస వ్యాయామం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల మొటిమల సమస్య దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కరివేపాకు మజ్జిగ తాగితే ఎన్నో లాభాలు! స్కిన్ ఇన్ఫెక్షన్లు దూరం! - Curry Leaves Buttermilk Benefits