ETV Bharat / health

కాపర్​ బాటిల్​లో వాటర్ తాగుతున్నారా? - ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే! - Copper Water Bottles Facts

Copper Water Bottles Facts : ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా వాటర్ తాగడానికి కాపర్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారు. అయితే, మీరు అలా ఉపయోగిస్తున్నట్లయితే లేదా కొత్త బాటిల్​ తీసుకోవాలనుకుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే కొన్ని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు.

Copper Water Bottles
Copper
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 4:08 PM IST

Interesting Facts about Copper Water Bottles : మనం హెల్దీగా ఉండాలంటే రోజు సరైన పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో తగినంత నీరు తాగడం అంతే కీలకం. అయితే, ఈరోజుల్లో రాగి పాత్రలో వాటర్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా వాటి వాడకం పెరిగింది. దీంతో ఎక్కడికెళ్లినా కాపర్ వాటర్ బాటిల్​ను తీసుకెళ్తున్నారు. నిజానికి రాగి(Copper) పాత్రలో వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి మీరు కూడా రాగి బాటిల్​లో నీరు తాగడం స్టార్ట్​ చేయాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే ఉపయోగిస్తున్నారా? అయితే, ఈ బాటిల్​ గురించి 10 విషయాలు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పోషక విలువలు పెరుగుతాయి : కాపర్ బాటిల్​లో నీరు నిల్వ చేయడం వల్ల దాని పోషక విలువలు పెరుగుతాయి. ఫలితంగా ఆ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా రాగి యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను తొలగించడం ద్వారా నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. అదేవిధంగా రాగిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు నిపుణులు.

ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి : రాగి బాటిల్​లో నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. రాగి అధిక వినియోగం కాపర్ టాక్సిసిటీకి దారితీసే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కాలేయ పనితీరుపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే వికారం, వాంతులు, విరేచనాలు వంటి కొన్ని ప్రారంభ సంకేతాలను కలిగిస్తుందంటున్నారు. కాబట్టి కాపర్ వాటర్ బాటిల్స్​ను మితంగా, సరైన మార్గదర్శకత్వంలో ఉపయోగించడం చాలా ముఖ్యమంటున్నారు.

అధిక నాణ్యత గల రాగిని మాత్రమే కొనండి : మీరు వాటర్ తాగడానికి కాపర్ బాటిల్ యూజ్ చేయాలనుకుంటే ఎప్పుడూ అధిక నాణ్యత కలిగిన వాటినే కొనాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాకాకుండా తక్కువ ధరకు లభిస్తున్నాయని నాణ్యతలేని వాటిని తీసుకుంటే అవి ఇతర లోహాలు లేదా మిశ్రమాలను కలిగి ఉండవచ్చని.. ఇవి నీటిలోకి చేరి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందంటున్నారు.

క్రమం తప్పకుండా క్లీనింగ్ : కాపర్ వాటర్ బాటిల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో విషయమేమిటంటే.. వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరం. ఎందుకంటే బాక్టీరియా పెరుగుదల, ఆక్సీకరణను నివారించడానికి డైలీ క్లీనింగ్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అయితే, వీటిని క్లీన్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ శుభ్రపరుచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.

అవి నిల్వ చేయవద్దు : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. కాపర్ బాటిల్స్​లో వాటర్​ మాత్రమే కాకుండా పండ్ల రసాలు వంటి ఇతర ద్రవాలను స్టోర్ చేసి తాగుతుంటారు. కానీ, అలా నిల్వ చేయడం మంచిది కాదనే విషయాన్ని గమనించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాగి ఆమ్ల లేదా ఆల్కలీన్ ద్రవాలతో చర్య జరుపుతుంది. ఇది మెటల్ లీచింగ్, సంభావ్య కాలుష్యానికి దారితీస్తుంది. కాబట్టి సిట్రస్ జ్యూస్‌లు, కార్బోనేటేడ్ డ్రింక్స్ లేదా యాసిడ్ ఫుడ్స్ వంటి పానీయాలను రాగి వాటర్ బాటిళ్లలో ఎక్కువ కాలం నిల్వ ఉంచకపోవడం మంచిది అంటున్నారు.

రాగి పాత్రలు సీల్ తీసిన వాటిలా మెరిసిపోవాలా? - ఇలా చేయండి!

శుభ్రమైన నీటిని మాత్రమే నిల్వ చేయండి : మీరు రాగి సీసాలో నింపే నీటి నాణ్యత కీలకం. రాగి వినియోగం ప్రయోజనాలను పెంచడానికి, హానికరమైన కలుషితాలను తీసుకునే ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు శుభ్రమైన, ఫిల్టర్ చేసిన నీటిని ఉపయోగించడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు.

తరచుగా వాటర్ మార్చుతుండాలి : రాగి వాటర్ బాటిల్లో నీటిని స్టోర్​ చేస్తున్నప్పటికీ, ఎక్కువ కాలం పాటు నీటిని సీసాలో ఉంచకుండా ఉండటం మంచిది. ఎందుకంటే బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి, సరైన నీటి నాణ్యతను నిర్ధారించడానికి తరచుగా బాటిల్​లో వాటర్ ఛేంజ్ చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వేడి నీటిని పోయవద్దు : రాగి అధిక ఉష్ణ వాహకత కలిగిన లోహం. ఇది త్వరగా వేడిని గ్రహించగలదు. కాబట్టి కాపర్ వాటర్ బాటిల్‌లో ఎప్పుడూ వేడి నీటిని నింపవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వేడి నీరు వల్ల రాగి లోహం త్వరగా కరిగి వాటర్​లోకి చేరే అవకాశం ఉంటుందంటున్నారు.

ఇవేకాకుండా మీరు రాగి వాటర్ బాటిల్​ను యూజ్ చేయాలనుకుంటే ముందుగా దానిలోని వాటర్ తాగితే మీ శరీరానికి పడుతుందో లేదో పరీక్షించుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించి కాపర్ వాటర్​ బాటిల్​ను యూజ్ చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే వాటర్ బాటిల్ కొనే ముందు దాని భద్రతా ప్రమాణాలు తెలుసుకొని తీసుకోవడం ఉత్తమ అని చెబుతున్నారు.

కాపర్ బాటిల్స్​లో వాటర్ తాగుతున్నారా? - అయితే మీ లివర్​ డేంజర్​ జోన్​లో పడ్డట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.