ETV Bharat / health

వ్యాయామం చేశాక ఈ ఫుడ్స్ అస్సలు తినకండి - లేదంటే మీరు పడ్డ కష్టమంతా బూడిదపాలే! - Avoid These Foods Post Workouts

Avoid These Foods Post Workouts : మారిన జీవనశైలి కారణంగా చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా డైలీ రకరకాల వర్కౌట్స్​ చేస్తుంటారు. అయితే, మార్నింగ్ గ్రౌండ్​లో చెమటలు కక్కితే సరిపోదు.. ఆహారపు అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వ్యాయామం చేశాక ఈ ఆహార పదార్థాలను అస్సలు తినవద్దని సూచిస్తున్నారు. అవేంటంటే?

Foods
These Foods Avoid after Workouts
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 3:21 PM IST

These Foods Avoid after Workouts : ఆరోగ్యం కోసమో, అందం కోసమో డైలీ వ్యాయామాలు చేస్తుంటారు చాలా మంది. అందుకోసం వాకింగ్, రన్నింగ్, జిమ్​కు వెళ్లి కసరత్తులు చేయడం వంటివి ఎంచుకుంటారు. అయితే, బరువు తగ్గి మంచి ఫిట్​నెస్​ను సొంతం చేసుకోవాలంటే వ్యాయామం ఒక్కటే సరిపోదు.. అందుకు తగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అలాగని ఏది పడితే అది తింటే మొదటికే మోసం వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మీ శరీరాకృతిని మెరుగుపరచుకోవాలంటే.. వ్యాయామం తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను(Foods) అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే, మీరు ఎంత వర్కౌట్ చేసినా నో యూజ్ అంటున్నారు. ఇంతకీ, వ్యాయామం తర్వాత తినకూడని ఆహార పదార్థాలేంటి? తినాల్సినవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అధిక చక్కెర పదార్థాలు : మీరు వ్యాయామం చేశాక కచ్చితంగా తినకూడని ఫుడ్స్.. హై షుగర్ ఫుడ్స్. ముఖ్యంగా స్వీట్స్ జోలికి అస్సలు వెళ్లకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వీటిలో ఉండే శుద్ధి చేయని చక్కెర శరీరానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా, బరువు పెరగడానికి దారి తీయవచ్చంటున్నారు నిపుణులు.

అధిక కొవ్వు పదార్థాలు : వ్యాయామం తర్వాత తగిన ఫలితం పొందాలంటే మీరు అధిక కొవ్వు ఉన్న పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. వేయించిన ఆహారాలను అస్సలు తినకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఈ కొవ్వు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా మజిల్స్​కు అవసరమైన పోషకాలను త్వరగా పొందలేరంటున్నారు నిపుణులు.

2015లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. వ్యాయామం తర్వాత వేయించిన ఆహారాలు తినే వ్యక్తులు బరువు పెరుగుతారని, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని వెల్లడైంది. ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రముఖ వైద్యుడు జాన్ స్మిత్.. వ్యాయామం చేశాక ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకునే వారు బరువు పెరుగుతారని ఆయన పేర్కొన్నారు.

అధిక ఉప్పు పదార్థాలు : వీటిని కూడా వ్యాయామం చేశాక అస్సలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ ఫుడ్స్​లో ఉండే అధిక కంటెంట్ సోడియం శరీరం నుంచి మరింత నీరు కోల్పోవడానికి దారితీస్తుంది. అప్పటికే మీరు వ్యాయామం చేసేటప్పుడు చెమట రూపంలో తగినంత నీరు కోల్పోతారు. ఫలితంగా డీహైడ్రేషన్​ తలెత్తవచ్చు. అంతేకాకుండా, కొన్ని జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు : వ్యాయామం తర్వాత ఈ రకమైన ఆహారపదార్థాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఫాస్ట్​పుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్​ జోలికి అస్సలు వెళ్లకూడదంటున్నారు. ఇవి మీకు వ్యాయామం చేయడం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలను పోయేలా చేస్తాయని సూచిస్తున్నారు నిపుణులు. కాబట్టి వ్యాయామం తర్వాత వీటికి దూరంగా ఉండడం బెటర్ అంటున్నారు.

జిమ్‌ చేయడానికి వెళ్తున్నారా? - ఈ ఫుడ్‌ తింటున్నారా?

మాంసాహారం : చాలా మంది వ్యాయామం చేశాక తగిన శక్తి, ప్రొటీన్లు లభించాలని మాంసాహర పదార్థాలు తీసుకుంటుంటారు. కానీ, వ్యాయామం తర్వాత నాన్​వెజ్​ తీసుకోకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మాంసాహారానికి బదులుగా ఇతర ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు : మీరు వ్యాయామం చేశాక వీటిని అస్సలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం తర్వాత కూల్​డ్రింక్స్​కు వీలైనంత దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీరు చేసే వర్కౌట్ బాడీలో కొవ్వులు, కార్బోహైడ్రేట్​లను కరిగిస్తున్నప్పుడు కూల్​డ్రింక్స్ దానిని అడ్డుకుంటాయని చెబుతున్నారు. అవసరమైతే చక్కెర లేకుండా సహజ పండ్ల రసాలను తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.

తినాల్సినవి : వ్యాయామం తర్వాత బాదం, ఖర్జూరం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే మొలకలు తీసుకోవచ్చంటున్నారు. వీటిలో ఉండే ఫైబర్ శరీరానికి శక్తిని అందించడమే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడతాయంటున్నారు. అలాగే కొన్ని తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ ఫుడ్స్​తో పోలిస్తే కోడిగుడ్డు నథింగ్ - ఫుల్​ ప్రొటీన్ - మీ కండరాలు యమా స్ట్రాంగ్ అవుతాయ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.