ETV Bharat / entertainment

ఎన్టీఆర్​తో 'వార్​ 2' షూటింగ్​ - సూపర్ హింట్ ఇచ్చిన హృతిక్​ రోషన్​ - వార్​ 2 షూటింగ్​పై హృతిక్ రోషన్

War 2 Shooting Update: జానియర్​ ఎన్టీఆర్​తో కలిసి నటిస్తున్న 'వార్ 2' సినిమా షూటింగ్​ గురించి అప్డేట్ ఇచ్చారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. ఆ వివరాలు.

ఎన్టీఆర్​తో 'వార్​ 2' షూటింగ్​ - సూపర్ హింట్ ఇచ్చిన హృతిక్​ రోషన్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 3:45 PM IST

War 2 Shooting Update: యాక్టింగ్ పవర్ హౌజ్, ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్​ హీరోస్​ను ఇద్దరిని కలిపింది- బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'వార్ 2'. ప్రముఖ డైరెక్టర్​ 'బ్రహ్మస్త్ర' ఫేమ్​ అయాన్ ముఖర్జి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్​ను జరుపుకుంటోంది. వార్ సినిమాకు సీక్వెల్​గా ఇది రూపొందుతోంది. ఇందులో కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తుండగా- హృతిక్​కు అపోజిట్ రోల్​లో జూనియర్​ ఎన్టీఆర్ కనిపించనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్​లో ఇంకా వీరిద్దరూ జాయిన్ అవ్వలేదు.

తాజాగా ఈ సినిమా గురించి హృతిక్​ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. "ఫైటర్ అయిపోయింది. ఇక బ్రేక్ లేకుండా వార్ 2లోకి ఎంటర్ అవుతున్నాను. అనుకున్న దానికన్నా ముందే వార్​ 2 మొదలవుతుంది. ఎంత త్వరగా అంటే నాకు ఊపిరి పీల్చుకునేంత సమయం కూడా లేనంత. అప్పుడు కబీర్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. సినిమా గురించి ఇప్పుడే ఎక్కువ రివీల్ చేయలేను కానీ కబీర్ ఈసారి ఇంకా కొత్తగా కనిపిస్తాడు" అని హృతిక్ చెప్పుకొచ్చారు.

కాగా, ఎన్టీఆర్ - హృతిక్​ రోషన్ కలిసి నటిస్తున్నారు అని అనౌన్స్ చేయగానే దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్​ తెగ సంతోషపడిపోయారు. అనౌన్స్మెంట్​తోనే ఈ చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్​గా మారిపోయింది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న స్పై యూనివర్స్‌ చిత్రాల్లో ఇది ఏడో సినిమాగా తెరకెక్కుతోంది.

NTR Devara Shooting: ఇకపోతే ఎన్టీఆర్​ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్​ 5న(Devara Release Date) విడుదల కానుంది. కానీ పోస్ట్​ పోన్ అయ్యే అవకాశముందని అంటున్నారు. ఈ చిత్రంలో విలన్​గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్​ సైఫ్ అలీ ఖాన్ రీసెంట్​గా గాయపడి సర్జరీ చేయించుకున్నారు. మరి ఆయన సెట్​ అయ్యే లోగా తారక్​ వార్ 2 షూటింగ్​లో స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు అంటున్నారు.

థియేటర్లలో చిన్న చిత్రాల హవా - మరి ఓటీటీలో ?

'ధనుశ్​ 51' షూటింగ్ స్టార్ట్​​ - తిరుపతిలో మూవీ టీమ్ సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.