ETV Bharat / entertainment

'విశ్వంభర' ప్రపంచంలోకి చిరు ఎంట్రీ - రిలీజ్ ఎప్పుడంటే ? - విశ్వంభర మూవీ అప్​డేట్స్

Vishwambhara Movie Release Date : మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్​డేట్​ను మేకర్స్​ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్​ను రివీల్​ చేశారు.

Vishwambhara Movie Release Date
Vishwambhara Movie Release Date
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 11:08 AM IST

Updated : Feb 2, 2024, 12:49 PM IST

Vishwambhara Movie Release Date : టాలీవుడ్ స్టార్​ హీరో, మెగాస్టార్ చిరంజీవి లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. చిరు 156వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో 'బింబిసారా' ఫేమ్​ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్​ను కంప్లీట్​ చేసుకున్న ఈ మూవీ రిలీజ్​ డేట్​ను తాజాగా మేకర్స్​ రిలీజ్​ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.

'అతీత శక్తుల పోరాటం నుంచి లెజెండ్స్‌ అవతరిస్తారు' అంటూ ఓ సాలిడ్​ అండ్​ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను షేర్​ చేసి ఈ న్యూస్​ను షేర్​ చేసింది చిత్రబృందం. ఇక ఈ పోస్టర్​ను చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్​ను ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు సెట్స్​లోకి చిరు అడుగుపెట్టారని, షూటింగ్​ శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు.

ఇక ఈ సినిమాలో మరింత ఫిట్‌గా కనిపించాలని చిరు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఫిట్​నెస్​ ట్రైనర్ సూచనల మేరకు చెమటోడుస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఆయన అభిమానులు పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్​ అవుతోంది.

మరోవైపు ఈ సినిమాలో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్​ చేయలేదు. అటు హైదరాబాద్​లో ఈ సినిమా కోసం దాదాపు 7 ఎకరాల్లో 13 భారీ సెట్స్ నిర్మించినట్లు సమచారం. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ సెట్స్ నిర్మాణం జరిగిందట.

Chiranjeevi Socio Fantasy Movies : ఇక చిరు ఈ తరహా జానర్​ సినిమాల్లో నటించడం ఇదేం తొలిసారి కాదు. ఆయన ఇది వరకే 'జగదేక వీరుడు అతిలోక సుందరి','అంజి' లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమాతో తనను మరింత కొత్తగా చూపించేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తాన్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమాకు మ్యాజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

'విశ్వంభర' - 68 ఏళ్ల వయసులో జిమ్‌లో మెగాస్టార్ కసరత్తులు

మెగాస్టార్​తో హరీశ్ శంకర్ కొత్త ప్రాజెక్ట్!

Last Updated : Feb 2, 2024, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.