ETV Bharat / entertainment

'మెకానిక్ రాకీ' గ్లింప్స్ - డ్రైవింగ్​లో 'L' సింబల్​కు కొత్త మీనింగ్ చెప్పిన శ్రద్ధా - Vishwaksen Mechanical Rocky Glimpse

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 12:46 PM IST

Vishwaksen Mechanical Rocky Glimpse : టాలీవుడ్ స్టార్ హీరో విశ్వక్​ సేన్ లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ నుంచి మేకర్స్ స్పెషల్ గ్లింప్స్​ను విడుదల చేశారు. ఆ వీడియోలోని హైలైట్స్​ను ఓ లుక్కేద్దామా.

Vishwaksen Mechanical Rocky Glimpse
Vishwaksen (ETV Bharat)

Vishwaksen Mechanical Rocky Glimpse : 'మాస్​ కా దాస్' విష్వక్‌ సేన్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ 'మెకానిక్ రాకీ' నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ గ్లింప్స్​ను విడుదల చేశారు. ఆద్యంతం ఇంట్రెస్టింగ్​గా ఉండే ఈ గ్లింప్స్​ ప్రస్తుతం సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.

ఇక ఈ వీడియోలో గ్యారేజ్​ మెకానిక్​గా విశ్వక్ చాలా నేచురల్​గా కనిపించారు. కొత్త మేనరిజాన్ని చూపిస్తు తన పాత్రలో చక్కగా ఒదిగిపోయినట్లు కనిపించారు. అయితే ఇది పూర్తి యాక్షన్ బ్యాక్​డ్రాప్​తోనే కాకుండా అక్కడక్కడ లవ్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్​లు ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్​తోనూ ఆకట్టుకోనున్నారు. చివరిలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్​ తన కామెడీ టైమింగ్​తో అలరించారు. డ్రైవింగ్​లో 'L' అంటే లేడీ డ్రైవర్ అంటూ అమాయకంగా చెప్పి నవ్వులు పూయిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ ఇచ్చిన బ్యాక్​గ్రౌండ్​ స్కోర్ ఈ గ్లింప్స్​కు హైలైట్​గా నిలిచింది.

ఇక గ్లింప్స్‌ రిలీజ్​లో భాగంగా తాజాగా హైదరాబాద్​లో జరిగిన ఓ ఈవెంట్​కు మూవీటీమ్ వచ్చి సందడి చేసింది. ట్రైలర్ టెలికాస్ట్ చేసిన తర్వాత, చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. ఇక విష్వక్​ కుడా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

"ఈ కథ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఒక ప్రేక్షకుడిగా నన్ను నేను ఎలాంటి చిత్రాల్లో చూసుకోవాలనుకుంటున్నానో అటువంటి స్టోరీలకే ఓకే చెప్తున్నాను. ఈ గ్లింప్స్‌ చూస్తే మీకు ఇది రొటీన్‌ కథలా అనిపించవచ్చు. అయితే సినిమా చూసేటప్పుడు ఆ ఫీల్‌ అస్సలు రాదు. ఈ మూవీతో నేను చాలా పర్సనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. నేను పుట్టింది, పెరిగిందంతా మలక్‌పేట్‌లోనే. ఈ సినిమాలో నా పాత్ర పేరు రాకీ. మలక్‌పేట్‌లో ఉన్న ఓ కార్‌ గ్యారేజీకి నేను ఓనర్​గా ఇందులో కనిపించనున్నాను. ఓ లోకల్‌ కార్‌ మెకానిక్‌ స్టోరీనే ఈ సినిమా. నేచురాలిటీ కోసం ఆ ప్రాంతంలో కొన్ని సీన్స్​ షూట్‌ చేశాం. అలాగే మిగతావన్ని సెట్స్‌లో చిత్రీకరించాం" అంటూ సినిమా గురించి విష్వక్​ చెప్పారు.

హీరో విష్వక్ సేన్ సంచలన నిర్ణయం- ప్రశంసలే ప్రశంసలు!

'సినిమా చూడకుండానే చెప్తున్నారు - ఆరు గంటలకే రివ్యూలు రాశారు' - Vishwaksen Gangs Of Godavari

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.