ETV Bharat / entertainment

'జాతి రత్నాలు' డైరెక్టర్​తో విశ్వక్ మూవీ - 'ఫంకీ'గా టైటిల్ అప్​డేట్! - VISHWAKSEN FUNKY MOVIE

'జాతి రత్నాలు' డైరెక్టర్​తో విశ్వక్ మూవీ - షూటింగ్ ఎప్పుడంటే?

Vishwaksen Funky Movie
Vishwaksen (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2024, 12:53 PM IST

Vishwaksen Funky Movie : వరుస ప్రాజెక్ట్​లతో బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు 'మాస్​ కా దాస్' విశ్వక్​ సేన్. రీసెంట్​గా ఆయన 'మెకానికల్ రాకీ'తో ప్రేక్షకులను పలకరించగా, ఇప్పుడు మరో క్రేజీ మూవీతో అభిమానుల మందుకు రానున్నారు. 'జాతి రత్నాలు' ఫేమ్‌ డైరెక్టర్ కేవీ అనుదీప్‌తో కలిసి ఫంకీ అనే సినిమా కోసం పని చేయనున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరగ్గా, దానికి 'కల్కి 2898 AD' నాగ్‌అశ్విన్‌ పాల్గొని టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఆషికా రంగనాథ్‌ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నట్లు సమాచారం.

ఇక విశ్వక్‌ నటించిన మెకానికల్ రాకీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్​తో సరిపెట్టుకుంది. అయితే ప్రస్తుతం విశ్వక్​ రామ్‌ నారాయణ్‌ డైరెక్ట్ చేస్తున్న 'లైలా' అనే సినిమా కోసం వర్క్‌ చేస్తున్నారు. ఇందులోని కొంత భాగం కోసం విశ్వక్‌ అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నారట. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్​తో అభిమానులు ఈ చిత్రం గురించి నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, 'జాతిరత్నాలు' హిట్ అయ్యాక అనుదీప్‌ 'ప్రిన్స్‌' అనే సినిమాను తెరకెక్కించారు. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ లీడ్​ రోల్​లో వచ్చిందీ చిత్రం. అటు తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదవ్వగా, ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. కామెడీ టైమింగ్ ఫర్వాలేదనిపించినప్పటికీ, సినిమాకు అంతగా కనెక్ట్ కాలేకపోయమని ఆడియెన్స్​ నెట్టింట కామెంట్లు పెట్టారు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న విజయాన్ని అందుకోలేక నిరాశ పరిచింది. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు 'ఫంకీ' కోసం మళ్లీ మెగా ఫోన్‌ పట్టారు డైరెక్టర్ అనుదీప్​. అభిమానులు కూడా ఈ కాంబో ఏ మేరకు ఎంటర్​టైన్​ చేస్తుందో చూడాలని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

ద బాయ్స్ ఆర్ బ్యాక్!- త్వరలోనే సెట్స్​పైకి 'ఈ నగరానికి ఏమైంది 2'!

విష్వక్‌సేన్‌ 'మెకానిక్‌ రాకీ' ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.