ETV Bharat / entertainment

'చిరు సాంగ్స్ అంటే విరాట్​కు చాలా ఇష్టం - ఆయన గురించి అడుగుతుంటాడు' - Virat Kohli Chiranjeevi Songs - VIRAT KOHLI CHIRANJEEVI SONGS

Virat Kohli Chiranjeevi Songs : స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ ఒకానొక సమయంలో మెగాస్టార్​ చిరంజీవి సాంగ్స్​ను తెగ వినేవారట. ఈ విషయాన్ని తన క్లోజ్ ఫ్రెండ్ తాజాగా రివీల్ చేశాడు. అంతేకాకుండా వారిద్దరూ ఓ స్వీట్ నేమ్​తో పిలుచుకునేవారట. ఇంతకీ అదేంటంటే ?

Virat Kohli Chiranjeevi Songs
Virat Kohli Chiranjeevi (Getty Images, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 8:52 AM IST

Virat Kohli Chiranjeevi Songs : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని అతడి ఫ్రెండ్ రవితేజ రివీల్ చేశాడు. కోహ్లీకి టాలీవుడ్​లో ఓ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమని, అంతేకాకుండా ఆయన పాటలను చాలా ఇష్టంగా వినేవారంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి. అంతే కాకుండా వారిద్దరూ ఓ నిక్​నేమ్​తో పిలుచుకునేవారని వెల్లడించాడు.

" నేను, కోహ్లీ కలిసి అండర్ 15 డొమెస్టిక్ క్రికెట్ ఆడాం. ఇద్దరూ ఒకే రూమ్ షేర్ చేసుకునేవాళ్లం. అప్పుడు రోజూ మేము చిరంజీవి పాటలు పెట్టుకొని డ్యాన్స్​ చేసేవాళ్లం. కోహ్లీకి చిరు సాంగ్స్ అంటే ఎంతో ఇష్టం. అంతేకాదు మేమిద్దరం కూడా సరదాగా ఒకరినొకరు చిరు అని పిలుచుకునేవాళ్లం. అయితే మేమిద్దరం ఆరేళ్ల తర్వాత కలిసినప్పుడు కూడా చిరంజీవి ఎలా ఉన్నారు అని కోహ్లీ అడిగాడు." అంటూ కోహ్లీతో తన ఫ్రెండ్​షిప్​ను పంచుకున్నారు.

ఇది విన్న మెగా ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. కోహ్లీ కూడా చిరు ఫ్యానా? అని సంబరాలు చేసుకుంటున్నారు. చిరు అంటే మాములుగా ఉండదు మరి అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్​లో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్​డ్రాప్​తో ఈ సినిమా భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోంది. 'బింబిసార' ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. త్రిష, అశికా రంగనాథ్, ఇషా, సురభి లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియో కూడా ప్రేక్షకులను సినిమాపై మరిన్నీ అంచనాలు పెంచేసేంది. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఇక చిరు ఈ తరహా జానర్​ సినిమాల్లో నటించడం ఇదేం తొలిసారి కాదు. ఆయన ఇది వరకే 'జగదేక వీరుడు అతిలోక సుందరి','అంజి' లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమాతో తనను మరింత కొత్తగా చూపించేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

'విశ్వంభర' షూటింగ్​ - భారీ యాక్షన్ సీక్వెన్స్​లో చిరు

విరాట్​ రేర్​ రికార్డ్​ - ఇన్‌స్టాలో ఎక్కువ లైక్స్​ వచ్చిన ఫొటో అదే! - Most Liked Instagram Photo In India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.