ETV Bharat / entertainment

మతిపోయే రేంజ్​లో విజయ్​ 'GOAT' రైట్స్ - Vijay Thalapathy Goat - VIJAY THALAPATHY GOAT

Vijay Thalapathy Goat Movie: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న గోట్ మూవీ ఓటీటీ రైట్స్​ను భారీ ధరకు నెట్​ఫ్లిక్స్​ కోనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది.

VIJAY THALAPATHY GOAT
VIJAY THALAPATHY GOAT (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 6:52 PM IST

Vijay Thalapathy Goat Movie: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆయన రికార్డులను మ్యాచ్​ చేయడం ఇతర హీరోలకు కాస్త కష్టమే అని చెప్పాలి. ముఖ్యంగా తుపాకీ చిత్రం తర్వాత విజిల్, మాస్టర్, అదిరింది లాంటివి కమర్షియల్ హిట్స్​ వల్ల ఆయన మార్కెట్​ బాగా పెరిగింది. డబ్బింగ్ రైట్స్​కు కూడా డిమాండ్ పెరిగింది. అయితే ఇప్పుడాయన 'గోట్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​ మతిపోయే రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలిసింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపు రూ.110 కోట్లకు ఒప్పందం చేసుకుందనే వార్త చెన్నై సినీ వర్గాల్లో ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది.

అలాగే శాటిలైట్ హక్కులను ఇప్పటికే జీ గ్రూప్ ఏకంగా రూ.90 కోట్లకు కొనుగోలు చేసిందని అంటున్నారు.ఈ మూవీకి ఇంత డిమాండ్ ఉందంటే అది దళపతి విజయ్​ వల్ల మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే గోట్ డైరెక్టర్​ వెంకట్ ప్రభు ఫ్లాపుల్లో ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కూడా అంతగా ఫామ్​లో లేరు. ఇన్ని ప్రతికూలతల మధ్యలోనూ అంత ధర పలకడం అంటే విజయ్ ఇమేజ్ వల్లే సాధ్యమైంది. పైగా మరో విషయమేమిటంటే పొలిటికల్ ఎంట్రీకి ముందు విజయ్ చేయబోయే రెండు సినిమాల్లో ఈ గోట్ ఒకటి. మళ్ళీ స్క్రీన్ మీద ఆయన్ను చూడటం సాధ్యం కాదు కాబట్టి అందుకే ప్రేక్షకులు ఎగబడి చూస్తారనే అంచనాలు అందరిలోనూ బలంగా ఉన్నాయి.

ఇంకా ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, స్నేహ, జయరామ్, యోగిబాబు సహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్​గా నటిస్తోంది​. విజయ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారు. పాతికేళ్ల కుర్రాడిగానూ కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. వాయిదా పడకుండా కచ్చితంగా సినిమా రిలీజ్ చేసేలా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిసింది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.

విజయ్ దళపతి చివరి సినిమా - ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన వెట్రిమారన్​ - Thalapathy Vijay Vetrimaaran Movie

దళపతితో సినిమా - డీవీవీ దానయ్య తప్పుకోవడానికి ఆ రూ.250కోట్లే కారణమా? - vijay Thalapathy DVV Danayya

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.