My Sahiba Vijay Devarkonda Injured : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ మ్యూజిక్ ఆల్బమ్‌తో ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సాహిబా అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఆల్బమ్ కోసం రాధిక మదన్‌తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ సాహిబా ఆల్బమ్ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం విజయ్ దేవరకొండ ముంబయి వెళ్లారు. అయితే ఈ కార్యక్రమాన్ని ముగించుకుని బయటకు వస్తుండగా, ప్రమాదవశాత్తు విజయ్ మెట్లపై నుంచి జారిపడ్డారు. వెంటనే దీనిపై స్పందించిన విజయ్ టీమ్, ఆయనకు సాయం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు, విజయ్ ఫ్యాన్స్ ఆయనకు ఎలా ఉందోనని కాస్త ఆందోళన పడ్డారు.
ఫస్ట్ టాలీవుడ్ హీరో విజయే! - ఇకపోతే తెలుగులో స్టార్ హీరోలు స్పెషల్ మ్యూజిక్ వీడియో సాంగ్స్‌లో పెద్దగా కనిపించినట్టు దాఖలాలు లేవు. బాలీవుడ్లో మాత్రం ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ సహా పలువురు స్టార్ హీరోలు ఆడపాదడపా వీడియో సాంగ్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. ఇప్పుడీ బాలీవుడ్ హీరోల బాటలోనే విజయ్ దేవరకొండ అడుగులు వేస్తున్నారు. కెరీర్‌లో తొలి సారి హిందీ మ్యూజిక్ వీడియో సాంగ్‌లో నటిస్తున్నారు.
రాధికా మదన్‌తో కలిసి(My Sahiba Album Song Cast) - సాహిబా అనే పేరుతో రానున్న ఈ మ్యూజిక్ ఆల్బమ్‌లో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా మదన్ నటించింది. దీనిని బాలీవుడ్ పాప్ సింగర్ జస్లీన్ రాయల్ ఆలపించారు. సుధాన్షు సారియా దర్శకత్వం వహించారు. ఆదిత్య శర్మ, ప్రియా సారియా ఈ స్పెషల్ సాంగ్‌కు సాహిత్యాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సాహిబా మ్యూజిక్ వీడియో సాంగ్‌కు సంబంధించిన విజయ్ దేవరకొండ, రాధికా మధన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌ను బాగానే ఆకట్టుకుంది.
#VijayDevarakonda
— upcoming Gossips (@Upcomingchat) November 8, 2024
Guys guys don't don't anta
Kastha slip iyadu anthy
Girls 🤔🤔🤔#VD12 pic.twitter.com/sCUMFplNWH
VD 12 షూటింగ్లో ఏనుగుల కొట్లాట - స్పాట్ నుంచి గజరాజు జంప్! - Vijay Devarakonda VD12
నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' రివ్యూ - ఇది ఇప్పటి సినిమా కాదేమో!