Vennela Kishore OMG Teaser : హారర్ కామెడీ సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ బ్యాక్‌డ్రాప్ చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. ప్రేమకథా చిత్రమ్, అంజలి నుంచి రీసెంట్గా రిలీజైన ఓం భీమ్ బుష్ వరకు ప్రేక్షకుల్ని నవ్విస్తూ భయపెట్టిన చిత్రాలు చాలా వరకు మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. అందుకే ఓటీటీ అయినా థియేటర్ అయినా ఈ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.
అయితే ఇప్పుడు మరో హారర్, కామెడీ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. అదే ఓఎమ్‌జీ (ఓ మంచి ఘోస్ట్) మూవీ. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. వెన్నెల కిశోర్, షకలక శంకర్, నందితా శ్వేతతో పాటు నవీన్ నేని, నవి గాయక్, రఘుబాబు, రజత్ రాఘవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పురాతన బంగళాలోకి వచ్చిన కొంతమందికి అక్కడ ఉన్న దెయ్యం కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే పాయింట్‌తో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. రివెంట్ ఎలిమెంట్స్‌ను టచ్ చేశారు. కామెడీ, హారర్‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రచార చిత్రాన్ని చూపించారు. "పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు. కానీ దెయ్యాలకు మాత్రమే ఉంటుంది" అనే సంభాషణతో ప్రారంభమైన టీజర్లో "ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా, చంద్రముఖి చెల్లివైనా, కాశ్మోరా లవర్‌వైనా, కాంచన కజిన్‌వైనా" అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ తెగ నవ్వులు పూయిస్తోంది. "నేను మోహిని పిశాచి మోహం తీర్చా. కామిని పిశాచి కామం తీర్చా. శంకిని పిశాచి సంక నాకా. సంక నాకించా" అంటూ షకలక శంకర్ తన కామెడీతో కితకితలు పెట్టించాడు. ప్రేమకథా చిత్రమ్ 2, ఎక్కడికి పోతావు చిన్నవాడాతో పాటు పలు చిత్రాల్లో దెయ్యంగా నటించిన నందితా శ్వేతనే ఈ ఓఎమ్‌జీ (ఓ మంచి ఘోస్ట్)లోనూ దెయ్యం పాత్ర పోషించింది.
ఇకపోతే ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. డా.అబినికా ఇనాబతుని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వీకెండ్ స్పెషల్ - OTTలో 25 క్రేజీ సినిమా/సిరీస్‌లు స్ట్రీమింగ్ - This Week OTT Releases Movies
నెం.59పై రామ్ చరణ్ ఫ్యాన్స్ అసహనం! - ఎందుకంటే? - Ram Charan Game Changer