ETV Bharat / entertainment

ఇప్పుడే అసలు ఆట మొదలైంది! : వరలక్ష్మీ శరత్‌కుమార్‌ - Varalaxmi Nicholai Sachdev - VARALAXMI NICHOLAI SACHDEV

Varalaxmi Sarathkumar Nicholai Sachdev : నటి వరలక్ష్మీ శరత్​ కుమార్ తన భర్త నికోలయ్‌ సచ్‌దేవ్​తో కలిసి తాజాగా ప్రెస్​మీట్​లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్​ను ఉద్దేశించి మాట్లాడారు. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Varalakshmi Sarathkumar (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 5:07 PM IST

Varalakshmi Sarathkumar (source ETV Bharat)

Varalaxmi Sarathkumar Nicholai Sachdev : నటి వరలక్ష్మీ శరత్​ కుమార్​ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో భర్తతో కలిసి పాల్గొన్నారు. తనను నటిగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు జ్వరం ఉన్నా తెలుగు ఆడియెన్స్‌కు థ్యాంక్స్‌ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మీట్‌ అండ్‌ గ్రీట్‌ ఈవెంట్‌కు హాజరయ్యామని పేర్కొన్నారు.

"ఈ రోజు ప్లాన్ చేసిన ఈ వేడుకను రద్దు చేయాలని అనిపించలేదు. అందుకే జ్వరం ఉన్నా ఇక్కడికి వచ్చాం. హైదరాబాద్‌ నాకు సెకండ్‌ హోమ్‌ టౌన్‌ లాంటిది. ఎందుకంటే అంతగా మీరు నాపై అభిమానం చూపించారు. మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్‌. ఇకపైనా కూడా మీ ప్రేమ నాపై ఉంటుందని ఆశిస్తున్నాను. నా కెరీర్‌ ముగియలేదు. మళ్లీ ఇప్పుడే కొత్తగా మొదలైంది. నా భర్త ప్రోత్సాహంతో మరిన్ని చిత్రాల్లో నటిస్తాను" అని పేర్కొన్నారు.

సచ్‌దేవ్‌ మాట్లాడుతూ - "నా భార్య వరలక్ష్మి మీ అందరికీ బాగా పరిచయమే. అందం, టాలెంట్​, యాక్టింగ్​ విషయంలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఎంతో ఉన్నతమైంది. సంస్కృతి, సంప్రదాయం, కుటుంబానికి ఎంతో గౌరవం ఇస్తుంది. ఆమెను పెళ్లి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే తెలుగు నేర్చుకుంటాను" అని అన్నారు. ఇకపోతే ఇటీవల కోలీవుడ్‌ మీడియాతోనూ ఈ దంపతులు ప్రత్యేకంగా ముచ్చటించిన సంగతి తెలిసిందే.

కాగా, వరలక్ష్మీ శరత్​కుమార్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. తమిళం, తెలుగు ఇలా అన్ని పలు భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తోంది. ముందు హీరోయిన్‌గానే ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా మారిపోయింది. చెల్లిగా, అక్కగ నటిస్తూ చివరిగా విలన్​గా మారిపోయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్​లో పవర్ ఫుల్ లేడీ విలన్​గా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. క్రాక్‌, వీరసింహారెడ్డి, హనుమాన్‌ సహా తదితర చిత్రాలతో మెప్పించింది.

థాయ్​లాండ్ బీచ్​లో డెస్టినేషన్ వెడ్డింగ్ - వరలక్ష్మీ, నికోలాయ్ పెళ్లి ఫొటోలు చూశారా? - Varalakshmi SarathKumar Marriage

'సూసేకి అగ్గి రవ్వ' - పుష్ప 2పై దేవీ శ్రీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ - Pushpa 2 Songs

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.