Varalakshmi Sarathkumar Wedding Reception : 'హనుమాన్' సినిమా ఫేమ్ కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు నికోలాయ్ సచ్‌దేవ్‌తో ఆమె ఏడు అడుగులు వేశారు. థాయ్‌లాండ్‌లో జులై 2న బంధువులు, అతికొద్ది మంది సన్నిహితుల నడుమ వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. అయితే సెలబ్రీటీలతో పాటు మిగతా ఫ్రెండ్స్ కోసం కోసం ఈ జంట చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
தமிழ் சினிமாவே வாழ்த்து சொல்ல பிரம்மாண்டமாக நடந்து முடிந்த Varalaxmi and Nicholai's wedding reception 👩🏻❤️👨🏼#VaralakshmiSarathkumar #VaralakshmiWedsNicholaisachdev #Sarathkumar #radhikasarathkumar pic.twitter.com/w170cGhJj1
— ProvokeTV (@Provoke_TV) July 4, 2024
టాలీవుడ్ నుంచి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని, తమన్, వెంకటేశ్, మంచు లక్ష్మి లాంటి స్టార్స్ రాగా కోలీవుడ్ నుంచి ఖుష్బూ దంపతులు, సిద్ధార్థ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్, లాంటి సెలబ్రీటుల వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. శాండల్‌వుడ్ నుంచి కిచ్చా సుదీప్ ఫ్యామిలీ హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అలనాటి అందాల తార శోభన కూడా ఈ రిసెప్షన్లో సందడి చేశారు.
Clicks from #VaralakshmiSarathkumar & #NicholaiSachdev's wedding reception#VNWedding pic.twitter.com/2lwWngjzK1
— Vamsi Kaka (@vamsikaka) July 3, 2024
Clicks from #VaralakshmiSarathkumar & #NicholaiSachdev's wedding reception#VNWedding pic.twitter.com/2lwWngjzK1
— Vamsi Kaka (@vamsikaka) July 3, 2024
ఇక వరలక్ష్మీ సీనియర్ హీరో, నటుడు శరత్ కుమార్ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట హీరోయిన్గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, అలాగే పవర్ఫుల్ విలన్‌గా సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రతినాయికగా, సహాయ నటిగా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల్ని మెప్పించింది. 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మూవీలో హీరో అక్క అంజమ్మగా తన నటనతో అదరగొట్టేసింది.
ఇక నికోలయ్ సచ్‌దేవ్ ముంబయికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఈయన పలు ఆర్ట్ గ్యాలరీలను కూడా నిర్వహిస్తుంటారు. అంతే కాకూండా ఆన్‌లైన్ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులు విక్రయిస్తుంటారు. ఈ ఇద్దరూ 14 ఏళ్లుగా ప్రేమలో తాజాగా వారి ప్రేమ కథను బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేశారు.
సెలైంట్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్మెంట్ - కాబోయే మొగుడు ఎవరంటే?
అమ్మ, రాధికా ఆంటీతో నన్ను చూసి నాన్న షాకయ్యారు : వరలక్ష్మీ శరత్‌కుమార్