Tollywood Upcoming Movies Overseas Rights : తెలుగు సినిమాలకు ఓవర్సీస్‌లో మార్కెట్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ మన సినిమాలు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న బడా సినిమాల్లో ఏ చిత్రం ఎంతకు అమ్ముడు పోయిందో ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం అందింది.
వివరాల్లోకి వెళితే - టాలీవుడ్‌లో భారీ హైప్ ఉన్న చిత్రాలు 'పుష్ప 2', 'దేవర', 'కల్కి', 'గేమ్ ఛేంజర్','విశ్వంభర'. ఇంకా పలు సినిమాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో 'కల్కి' బిజినెస్ ఇంకా మొదలు కాలేదు. కానీ ఇతర చిత్రాలకు చాలా వరకు బిజినెస్ ముందుగానే జరిగినట్లు తెలిసింది.
గతేడాది డిసెంబర్లో విడుదలైన ప్రభాస్ 'సలార్' ఓవర్సీస్‌లో మంచి రేటు పలికింది. రూ.72కోట్ల వరకు అమ్ముడుపోయిందట. అంతకుముందు 'బాహుబలి 2' రూ. 70కోట్లకు అమ్ముడుపోగా 'ఆర్‌ఆర్‌ఆర్' రూ.68కోట్లకు పలికిందని అన్నారు. అలా ఈ మూడు చిత్రాలు ఓవర్సీస్‌లో అత్యధిక ధర పలికిన చిత్రాలుగా నిలిచాయి.
అయితే ఇప్పుడా రికార్డులను అల్లు అర్జున్ బ్రేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన హీరోగా నటిస్తున్న 'పుష్ప 2' ఓవర్సీస్‌లో భారీ ధరకు అమ్ముడుపోయేలా కనిపిస్తోంది. రూ.90 కోట్ల వరకు పలుకుతుందని సమాచారం. అయితే ఈ డీల్‌పై ఇంక్లా క్లారిటీ లేదు. ఒకవేళ ఈ డీల్ కనుక సక్సెస్ అయితే తెలుగు హీరోల్లో బన్నీదే హైయెస్ట్ రికార్డ్ అవుతుంది. ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తెలుగు నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం ఎన్టీఆర్ 'దేవర'. దాదాపు రూ.300కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ చిత్రం ఓవర్సీస్‌లో చాలా తక్కువకే పలికిందని చెప్పాలి. రూ.27కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం అందింది. ఏప్రిల్ 5న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.
ఇక శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' రూ. 20కోట్లకు అమ్ముడైందని తెలిసింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ 'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్ క్లోజ్ అయ్యిందట. రూ.18కోట్లకు అమ్ముడు పోయిందని తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆ విషయంలో రాజమౌళి అంటే కోపం : ప్రశాంత్ వర్మ
హృతిక్ మూవీస్‌లో హైయ్యెస్ట్ గ్రాసర్ - 'ఫైటర్' బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే ?