Balayya Records: నందమూరి బాలకృష్ణ అంటే బాక్సాఫీస్‌కు బాస్. కంటి చూపుతోనే రికార్డులు తిరిగి రాయగల సత్తా ఉన్న నటుడు. నైజాం, సీడెడ్, ఆంధ్ర ఏ సెంటరైనా బాలయ్య దిగనంత వరకే. ఒక్కసారి ఆయన అడుగెడితే హిస్టరీ రిపీట్ అవ్వుద్దంతే. నందమూరి వంశం నుంచి తెరంగేట్రం చేసి సుమారు 48ఏళ్లకు పైగా అగ్రస్థాయి నటుడిగా రాణిస్తున్నారు బాలయ్య. ఆయన కెరీర్లో సాధించిన రికార్డులు, అవార్డులెన్నో. మరి సోమవారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.
నాలుగు దశాబ్దాల పైచిలుకు కెరీర్లో బాలకృష్ణ 108 సినిమాల్లో హీరోగా నటించారు. మాస్ యాక్షన్‌కు బాలయ్య పెట్టింది పేరుగా ఎదిగారు. అందులో ముఖ్యంగా 'నరసింహానాయుడు','లక్ష్మీ నరసింహ','సమరసింహా రెడ్డి', 'సింహా', 'లెజెండ్', 'వీరసింహా రెడ్డి' సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటితోపాటు బాలయ్య నటించిన వాటిల్లో టాప్ చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
- అదిత్య 369: టాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన తొలి సినిమా 'అదిత్య 369'. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయెల్ రోల్లో నటించారు. సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా తెరకెక్కించారు. అప్పట్లోనే టైమ్ ట్రావెల్ సినిమాగా ఆదిత్య 369 పలు రికార్డులు బద్దలుకొట్టింది.
- భైరవ ద్వీపం: సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాలో కురూపిగా నటించి బాలయ్య కన్నీళ్లు పెట్టించారు. మరో కొత్త జానర్‌తో భైరవ ద్వీపంతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో బాలకృష్ణ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
- సమరసింహా రెడ్డి: ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సమరసింహా రెడ్డి'లో బాలయ్య విశ్వరూపం ప్రదర్శించారు. వైట్ అండ్ వైట్ ఔట్ ఫిట్‌తో కనిపించిన బాలయ్య థియేటర్లలో ఫ్యాన్స్‌తో విజిల్స్ కొట్టించారు. 20ల్లో ఈ సినిమా బాలయ్య కెరీర్లో మంచి హిట్ ఇచ్చింది. టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గానూ నిలిచింది.
- సింహ: సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను 'సింహా' సినిమాతో బాలయ్యతో తొలిసారి జతకట్టారు. బాలయ్య కెరీర్లో ఈ సినిమా టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. క్లాస్, మాస్ యాక్షన్‌తో మెరిసిన బాలయ్య ఈసినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టారు. ఈ సినిమాతో యువతరం ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు.
- లెజెండ్: బాలకృష్ణ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో లెజెండ్ ఒకటి. ఈ సినిమాలో బాలయ్య డైలాగ్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అప్పట్లో ఈ సినిమా డైలాగ్స్ ట్రెండ్ సెట్ చేశాయి. బోయపాటి- బాలయ్య కాంబోలో వచ్చిన రెండో సినిమా ఇది. ఈ సినిమా పలు థియేటర్లలో 400+ రోజులు ఆడి కొత్త రికార్డు సృష్టించింది.
- అఖండ: యాక్షన్ అండ్ వివోషనల్ జానర్లో బోయపాటి తెరకెక్కించిన అఖండ, వీళ్లిద్దరి కాంబోలో హ్యాట్రిక్‌గా నిలిచింది. 2021లో థియేటర్లు బద్దలైపోయాయి. నాన్‌స్టాప్ యాక్షన్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంది.
- వీరసింహా రెడ్డి: గతేడాది సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య 'వీరసింహా రెడ్డి' సినిమాతో మరో బంపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్లో ఆదరగొట్టారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ బాలయ్య 108 ఫీట్ల కటౌట్ రూపొందించి అభిమానాన్ని చాటుకున్నారు.
ఏకైక హీరోగా బాలయ్య రికార్డ్- ఆ రోల్లో నటించాలనేదే నటసింహం కోరిక - Balakrishna Birthday
'NBK109' క్రేజీ అప్డేట్- గ్లింప్స్, టైటిల్ రివీల్ టైమ్ ఫిక్స్- ఎప్పుడంటే?