కొత్త అందాల్ని స్వాగతించడంలో ఎప్పుడూ ముందుంటుంది టాలీవుడ్. అందుకే ప్రతి ఏడాది నార్త్ లేదా కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్ నుంచి కొత్త సోయగాలు తెలుగు తెరలపై వచ్చి సందడి చేస్తుంటాయి. అలా త్వరలోనే తెలుగులో పరిచయం కానున్న కొత్త నాయికలు ఎవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం.
నందమూరి వారసుల కోసం కొత్త తారలు! - ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నుంచి ఇద్దరు వారసులు సినీ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. వారిలో ఒకరు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. ఆయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో(Prasanth varma mokshagna movie) సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి సెప్టెంబరు మొదటి వారంలో అనౌన్స్మెంట్ రానుందట. ఇందులో మోక్షజ్ఞ సరసన ఓ కొత్త భామ కనిపించనుందని సమాచారం.
అలానే నందమూరి ఫ్యామిలీ నుంచి రానున్న మరో హీరో జానకీ రామ్ తనయుడు నందమూరి తారక రామారావు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. యలమంచిలి గీత నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో తెలుగమ్మాయి వీణ రావును హీరోయిన్గా పరిచయం కానుంది.
ప్రభాస్ కల్కి 2898 ఏడీతో దీపికా పదుకొణె తెలుగు తెరకు పరిచయం కాగా, రాజాసాబ్‌తో కోలీవుడ్ భామ మాళవిక మోహనన్‌ను తెలుగులోకి ఎంట్రీ కానుంది. ఇక హను రాఘవపూడి - ప్రభాస్ సినిమాతో అయితే కొత్త సోయగం పరిచయం కానుంది. ఆమె పేరు ఇమాన్వి(Imanvi prabhas). డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న ఈ దిల్లీ సోయగం ఇప్పుడు హను రాఘవపూడి చిత్రంతో పరిచయం కానుంది.
విజయ్ దేవరకొండ దర్శకులు గౌతమ్ తిన్ననూరి, రవికిరణ్ కోలా, రాహుల్ సంకృత్యాన్‌తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో రవికిరణ్ సినిమాతో కొత్త భామ పలకరించనుంది. ఆమె పేరు రుక్మిణీ వసంత్(Rukmini Vasanth Sapta sagaralu). సప్త సాగరాలు దాటి చిత్రంతో ఈ కన్నడ కస్తూరి మంచి పేరు తెచ్చుకుంది.
ఇంకా ఓటీటీలో వచ్చిన జయ జయ జయహేతో ఆకట్టుకున్న దర్శన రాజేంద్రన్ ఇప్పుడు 'పరదా'తో తెలుగులోకి రానుంది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దర్శనతో పాటు అనుపమ పరమేశ్వరన్, సంగీత నటిస్తున్నారు.
కేజీయఫ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి 'తెలుసు కదా' చిత్రంతో టాలీవుడ్‌కు రానుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన తెరకెక్కిస్తున్నారు. రాశీ ఖన్నా మరో హీరోయిన్గా నటిస్తోంది. అలానే శ్రీనిధికి రానాతో కూడా ఓ సినిమా చేసే అవకాశం వచ్చిందని సమాచారం.
ఒకే ఏడాదిలో 6 బ్లాక్‌బస్టర్స్ - ఆ రేర్ రికార్డు బాలయ్యకే సొంతం! - Balakrishna Hit Movies List
భైరవ, రాయన్ వచ్చేశారు - ఈ వీకెండ్ OTTలో ఇంకా ఏఏ క్రేజీ మూవీస్ ఉన్నాయంటే? - This Week OTT Releases