ETV Bharat / entertainment

ఛార్మితో పాటు నిర్మాతలుగా మారిన ఈ 11 మంది తెలుగు హీరోయిన్స్​ తెలుసా? - Tollywood Heroines as Producers

Tollywood Heroines as Producers : హీరోయిన్లు ఇప్పుడు అన్నీ రంగాలలోనూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో చాలా మంది భామలు మల్టీటాలెంటెడ్​గా రాణిస్తున్న వారు ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది నిర్మాతలుగా కూడా అవతారమెత్తి మంచి హిట్​ సినిమాలను నిర్మిస్తున్నారు. వారెవరో తెలుసుకుందాం.

Etv ఛార్మితో పాటు నిర్మాతలుగా మారిన ఈ 11 మంది తెలుగు హీరోయిన్స్​ తెలుసా?
ఛార్మితో పాటు నిర్మాతలుగా మారిన ఈ 11 మంది తెలుగు హీరోయిన్స్​ తెలుసా?
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 7:59 AM IST

Tollywood Heroines as Producers : ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు యాక్టింగ్ సైడ్ ఉంటూనే నిర్మాతగా మారిన వారు ఉన్నారు. అప్పటి హీరోయిన్లు విజయనిర్మల, భానుమతిలతో సహా ఇప్పటి తరంలోని చాలా మంది కథానాయికలు ప్రొడ్యూసర్లుగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. వారెవరో తెలుసుకుందాం.

నిత్యామేనన్ : కామెడీ, రొమాంటిక్, యాక్షన్ అన్ని కేటగిరీ సినిమాల్లో కనిపించి మెప్పించిన నిత్యా మేనన్ స్కైల్యాబ్ చిత్రంతో నిర్మాతగా తొలి అడుగువేసింది. ఇందులో ఆమె ఒక లీడ్ రోల్ కూడా చేసింది.

అమలాపాల్ : ఫోరెన్సిక్ థ్రిల్లర్ కడవర్​తో ప్రొడ్యూసర్ అయిన అమలాపాల్ గబగబా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోంది. అమలాపాల్ ప్రొడక్షన్స్ పేరిట అడాయ్, అధో అంధా పరవాయి పోలాలు రిలీజ్​కు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా పిట్ట కథలు అనే వెబ్ సిరీస్ కూడా నిర్మించి అందులో లీడ్ రోల్​లో మీరా పాత్ర పోషించింది అమలా.

నిహారిక కొణిదెల : సినిమా అంటే ప్రాణమని ఆరేళ్లుగా పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్ పేరిట బ్యానర్ స్టార్ట్ చేసి ముద్ద పప్పు ఆవకాయ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ లాంటి హిట్ ప్రొజెక్టులను ప్రేక్షకుల ముందుకుతెచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై మంచి హిట్ రాకపోవడంతో మళ్లీ టీవీషోలు, వెబ్ సిరీస్​ల మీదనే ఫోకస్ పెట్టింది.

నయనతార : లేడీ సూపర్ స్టార్ నయనతార రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్​తో కలిసి కో ప్రొడ్యూసర్​గా మారారు. ఆమె పార్టనర్‌షిప్ పెట్టుకుంది ఎవరితోనే కాదు లైఫ్ పార్టనర్ విగ్నేష్ శివన్ తోనే.

నజ్రియా నజీమ్ : ఫహద్ ఫాజిల్ భార్య, మలయాళ నటి అయిన నజ్రియా, అదేనండీ, రాజా రాణి, బెంగళూరు డేస్ హీరోయిన్. తన పేరు మీదనే నజ్రియా నజీమ్ ప్రొడక్షన్స్ అని బ్యానర్ స్టార్ట్ చేసి చక్కటి కథాంశంతో ఉన్న సినిమాలు తెరకెక్కిస్తోంది.

ఛార్మీ కౌర్ : 2002లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఛార్మీ తన కెరీర్​లో చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంది. అయితే ఆమె తన ఫ్రెండ్ పూరీ జగన్నాథ్​తో కలిసి కో ప్రొడ్యూసర్​గా సినిమాలు తీస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్, లైగర్ వంటి సినిమాలు తీశారు.

జ్యోతిక : తెలుగింటి చంద్రముఖిగా జ్యోతిక ఫస్ట్ ఇన్నింగ్స్​, సెకండ్ ఇన్నింగ్స్​లోనూ సక్సెస్సే. ఇప్పుడు తన భర్త స్టార్ట్ చేసిన 2D ఎంటర్‌టైన్మెంట్స్‌కు కో ప్రొడ్యూసర్ వ్యవహరిస్తూ జై భీమ్ లాంటి మంచి ప్రాజెక్టులు చేస్తోంది.

తాప్సీ పన్నూ : బాలీవుడ్, టాలీవుడ్ రెండు ఇండస్ట్రీల్లో నటిగా స్పెషల్ ఇంప్రెషన్ దక్కించుకున్న తాప్సీ బ్లర్ర్ సినిమాతో ప్రొడక్షన్​లోకి అడుగుపెట్టింది.

రాధికా శరత్ కుమార్ : సీనియర్ నటి రాధికా రాడాన్ మీడియా వర్క్స్ పేరిట టెలివిజన్ సీరియల్స్, సినిమాలు నిర్మిస్తున్నారు. 70ల నుంచి సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్న రాధికా కెరీర్​లో చాలా రకాలైన పాత్రలు పోషించారు.

విజయ నిర్మల అండ్ భానుమతి : సీనియర్ నటీమణులు విజయ నిర్మల, భానుమతిలు చాలా సినిమాలు నిర్మించారు. విజయనిర్మల సొంత ప్రొడక్షన్​లో సాక్షి, మీనా, తాతా మనవడు వంటి సినిమాల్లో లీడ్ రోల్ పోషించారు. భానుమతి 1954లోనే తెలుగు సినిమా ప్రొడ్యూసర్. చక్రపాణి సినిమాతో ప్రొడక్షన్​లోకి అడుగుపెట్టి బామ్మ మాట బంగారు బాట, మంగమ్మ గారి మనవడు లాంటి గుర్తుండిపోయే సినిమాలు తీశారు.

వీళ్లు మాత్రమే కాకుండా బాలీవుడ్​లో ఆలియా భట్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కంగనా రనౌత్, కృతి సనన్, రిచా చద్దా, మాధురి దీక్షిత్ వంటి వారున్నారు.

'బాలయ్యతో సినిమా చేయాలని ఉంది - ఆయన్ను అలా చూడాలని నా కోరిక' - Balakrishna Prithvi Raj Movie

పెర్ఫార్మెన్స్​లోనే కాదు- రెమ్యునరేషన్​లోనూ టాపే- ఒక్కో పాటకు అన్ని లక్షలా? - Shreya Ghoshal Remuneration

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.