ETV Bharat / entertainment

టాలీవుడ్ బాక్సాఫీస్​పై తమిళ సినిమాల వార్ - ​త్వరలోనే రానున్న చిత్రాలివే! - Tollywood Boxoffice Tamil Movies - TOLLYWOOD BOXOFFICE TAMIL MOVIES

Tollywood Boxoffice Tamil Movies : ఈ ఏడాది రానున్న రోజుల్లో టాలీవుడ్​ బాక్సాఫీస్ ముందు తమిళ సినిమాల హవా ఎక్కువ కనపడనుంది. ఏఏ చిత్రాలు రిలీజ్ కానున్నాయో తెలుసుకుందాం.

source ETV Bharat
Tollywood Boxoffice Tamil Movies (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 5:58 PM IST

Tollywood Boxoffice Tamil Movies : కథ, కథనం బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఎంతలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు వచ్చి సందడి చేస్తుంటాయి.

అయితే ఈ ఏడాది రానున్న రోజుల్లో టాలీవుడ్​ బాక్సాఫీస్ ముందు తమిళ సినిమాల హవా ఎక్కువ కనపడనుంది. ఇప్పటికే తమిళ హీరోల చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్​, డిమాండ్ ఉంది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, కార్తీ, ధనుశ్​ నటించే సినిమాలు తెలుగులో మంచి కలెక్షన్లను అందుకుంటాయి.

రీసెంట్​గానే కమల్​ హాసన్​ భారతీయుడు -2తో(Kamalhassan Indian 2) విడుదలైంది. మంచి థియేట్రికల్ బిజినెస్​ కూడా చేసుకుంది. కాకపోతే టాక్ బాలేక వసూళ్ల విషయంలో ఫెయిల్ అయింది. ఇప్పుడు మరిన్ని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విక్రమ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ మూవీ తంగలాన్(Vikram Thangalaan) విడుదల కానుంది. విలక్షణ హీరో ధనుశ్ ‘రాయన్ ఆగస్టు 27న బాక్సాఫీస్​ ముందుకు రానుంది.

మరో స్టార్ హీరో సూర్య నటించిన భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామ్ కంగువ(Suriya Kanguva Movie) దసరా కానుకగా భారీ స్థాయిలోనే విడుదల కానుంది.

ఇక తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి నటించిన G.O.A.T(VijayThalapathy GOAT Movie) సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందు రానుంది. విజయ్ నటించిన గత చిత్రం లియో తెలుగులో దాదాపు రూ. 47 కోట్ల వసూళ్లను అందుకున్న సంగతి తెలిసిందే. మంచి బిజినెస్ కూడా జరిగింది.

ఈ సినిమాలతో పాటు దీపావళి కానుకగా అక్టోబరు 31న అజిత్ విదాముయార్చి(Ajith Vidaamuyarchi), శివ కార్తికేయన్ అమరన్ తెలుగు బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నాయి. ఇలా వరుసగా తమిళ చిత్రాలు టాలీవుడ్​ బాక్సాఫీస్​ వార్​కు రెడీ అవుతున్నాయి. చూడాలి మరి ఈ చిత్రాలు ఎలాంటి టాక్​ను అందుకుంటాయో, వసూళ్లను సాధిస్తాయో.

మిస్టీరియస్​ థ్రిల్లర్ 'తుంబాద్‌' డైరెక్టర్​తో సమంత కొత్త ప్రాజెక్డ్​​ - హీరో ఎవరంటే? - Samantha New Series

ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్​కు రెడీ - ఎప్పుడంటే? - Tollywood Boxoffice Rereleases

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.