ETV Bharat / entertainment

టాలీవుడ్ లవ్ కహాని- సినిమా కలిపిన స్టార్ కపుల్స్ వీళ్లే - Naga Chaitanya Samantha Love story

Tollywood Actors Love Marriages: టాలీవుడ్​లో ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీలే కాకుండా ఆఫ్ ది స్క్రీన్ ప్రేమ కథలు చాలానే ఉన్నాయి. అలా సినిమాలో కలిసి నటించిన వారితోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న హీరో- హీరోయిన్​లు వీళ్లే!

Tollywood Actors Love Marriages
Tollywood Actors Love Marriages
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 1:31 PM IST

Tollywood Actors Love Marriages: ఏదైనా సినిమా జనాల్లో క్లిక్ అయ్యిందంటే చాలు అందులో యాక్ట్ చేసిన హీరోహీరోయిన్లు జంట బాగుందని మెచ్చుకుంటారు. వాళ్లిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే బాగుండూ అని కోరుకుంటారు అభిమానులు. అయితే ఆన్ స్క్రీన్​పై ఉండే సెలబ్రిటీలు ఆఫ్ ది​ స్క్రీన్​లోనూ అదేవిధంగా ఉంటారనుకుంటే పొరపడినట్లే. చాలావరకు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులను పెళ్లి చేసుకుంటారు.

అయితే కొందరు ఇందుకు భిన్నంగా ఉంటారు. స్క్రీన్ షేర్​ చేసుకున్న వాళ్లతోనే లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకొని షూటింగ్​ సమయంలో ప్రేమలో పడతారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తారలు మన టాలీవుడ్​లో చాలా మంది ఉన్నారు. రీసెంట్​గా వివాహం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నుంచి ఎన్నో జంటలు ఉన్నాయి. నేడు వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలను వారి లవ్​ స్టోరీలపై ఓ లుక్కేద్దాం.

నాగార్జున- అమల: టాలీవుడ్ కింగ్ నాగార్జున- అమలది కూడా ప్రేమ వివాహమే. 'శివ' సినిమాతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్ జన్మించారు.

జీవిత- రాజశేఖర్: ఈ జంట గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. నిత్యం వార్తల్లో ఉంటారు. ఈ ప్రేమ పెళ్లి అంతా విచిత్రంగానే జరిగింది. ఓ తమిళ డైరెక్టర్ తన సినిమాకోసం రాజశేఖర్​కు జోడీగా జీవితను ఎంచుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి 'తలంబ్రాలు' మూవీలో కలిసి నటించారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇక 'ఆహుతి' సినిమా సమయంలో గాయపడ్డ రాజశేఖర్​ను జీవిత దగ్గరుండి చూసుకున్నారు. రాజశేఖర్​పై జీవితకు ఉన్న ప్రేమను అర్థం చేసుకున్న వారి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించి, 1991 చెన్నైలో వివాహం జరిపించారు. వీరికి శివాణి, శివాత్మిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శ్రీకాంత్- ఊహ: టాలీవుడ్​లో శ్రీకాంత్- ఊహ జంట అందరికీ తెలిసే ఉంటారు. వీరు 'ఆమె' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. తర్వాత వీరిద్దరు కలిసి 4 సినిమాల్లో నటించారు. ఆలా మరింత దగ్గరైన ఈ జంట తన, ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ శ్రీకాంత్ ఊహను ఆహ్వానించేవారు. అలా శ్రీకాంత్ ఫ్యామిలీకి ఊహ దగ్గరయ్యారు. దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో శ్రీకాంత్- ఊహ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

మహేశ్ బాబు- నమ్రత: 2000వ సంవత్సరంలో వచ్చిన 'వంశీ' సినిమాతో మహేశ్ బాబు- నమ్రత శిరోద్కర్ మధ్య పరిచయం ఏర్పడింది. అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 5ఏళ్ల తర్వాత 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కుమారుడు గౌతమ్, కుమార్తె సితారా ఉన్నారు.

పవన్ కల్యాణ్- రేణుదేశాయ్: 'బద్రి', 'జానీ' సినిమాలో కలిసి నటించిన పవన్- రేణుదేశాయ్ అప్పుడే ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత కుమారుడు అకీరానందన్ పుట్టాడు. తర్వాత పవన్- రేణుదేశాయ్ వివాహం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.

షాలిని- అజిత్: చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షాలిని 'బేబీ షాలిని'గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత హీరోయిన్​గా కూడాపలు సినిమాల్లో నటించారు. 2000వ సంవత్సరంలో కోలీవుడ్ స్టార్ అజిత్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

సూర్య- జ్యోతిక: కోలీవుడ్​కోపాటు టాలీవుడ్​లోనూ ఎంతో పాపులారిటీ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. ఆయన హీరోయిన్​ జ్యోతికను ప్రేమించి 2006లో పెళ్లి చేసుకున్నారు. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడుపుతుంటారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.

రామ్ చరణ్- ఉపాసన: రామ్ చరణ్- ఉపాసన కాలేజీ రోజుల్లోనే లవ్​లో పడ్డారు. పెద్దల సమక్షంలో వీరిద్దరి పెళ్లి 2012లో జరిగింది. వీరికి గతేడాది పాప కీంక్లారా పుట్టింది.

అల్లు అర్జున్- స్నేహ: స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్- స్నేహది కూడా ప్రేమ వివాహమే. వీరిద్దరు మొదటిసారి ఓ ప్రైవేట్ పార్టీలో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2011లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి బాబు అయాన్, పాప అర్హ ఉన్నారు.

నాగచైతన్య- సమంత: 'ఏమాయ చేసావే' మూవీలో జంటగా నటించిన నాగచైతన్య- సమంత ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తర్వాత కొంతకాలానికి వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు.

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి: హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడిన 5ఏళ్లకు వివాహం చేసుకున్నారు. వీరు పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన 'మిస్టర్' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు.

సాయి పల్లవికి చైతూ లవ్​ ప్రపోజ్- వీడియో పోస్ట్ చేసి సర్ప్రైజ్!

రెండు అక్షరాల టైటిల్​లో ఏడాది ప్రేమ కథ- రీరిలీజ్​కు ముందు గుట్టు విప్పిన డైరెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.