ETV Bharat / entertainment

రిలాక్స్ మోడ్​లోకి వెళ్లాలా? ఈ సినిమాలు చూస్తే మీ ఒత్తిడంతా ఉఫ్​! - Stress Buster Movies - STRESS BUSTER MOVIES

Stress Buster Movies OTT: డైలీ రొటీన్​లో ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు మూవీ లవర్స్​ సినిమాలు, వెబ్​సిరీస్​లు చూస్తుంటారు. అలా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్​ఫామ్​ల్లో స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ మూవీస్ లిస్ట్​పై ఓ లుక్కేయండి.

Stress Buster Movies OTT
Stress Buster Movies OTT (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 8:31 PM IST

Stress Buster Movies OTT: ఒకప్పుడు ఖాళీ దొరికితే టీవీలో ఏ ఛానెల్​లో మంచి సినిమాలు వస్తున్నాయా అని చూసేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి మారి ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీస్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇక డైలీ రొటిన్​లో ఏ మాత్రం ఒత్తిడికి గురైనా సినిమాలు, వెబ్​సిరీస్​లు చూసి కాస్త రిలాక్స్ అయ్యే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అలాంటి సినీలవర్స్​ కోసం ఆయా ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉన్న తెలుగు స్ట్రెస్ బస్టర్​ సినిమాల లిస్ట్ ఇక్కడ ఉంచాం. మరి ఆ సినిమాలేంటో చూసేయండి.

ఇట్లు అమ్మ(2021): అష్టకష్టాలు పడి పెంచిన కొడుకు కళ్ల ముందే చనిపోతే ఆ తల్లి బాధ వర్ణనాతీతం. అయితే ఆ తల్లి ఒంటరిగానే తన కొడుక్కి న్యాయం జరగాలని పోరాటం మొదలుపెడుతుంది. ఇంతకీ ఆమె గెలిచిందా లేదా అని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఉమా మహేశ్వర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తల్లిగా బాలసరస్వతి అనే పాత్రలో రేవతి నటించింది. ఇందులో రేవతితో పాటు పోసాని కృష్ణమురళి, రవి కాలే, మిహిరా కీలక పాత్రల్లో నటించారు.

స్కైలాబ్(2021 ): అంతరిక్షంలో నిర్మించిన ఒక స్పేస్ ల్యాబ్ హటాత్తుగా కూలిపోతే ఏం అవుతుంది అనే కథాంశంతో థ్రిల్లర్ కామెడీగా తెరకెక్కింది ఈ చిత్రం. నిత్యామీనన్, సత్యదేవ్, తరుణ్ భాస్కర్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.

ఫ్యామిలీ డ్రామా (2021): బాధ్యత లేదని, ఉద్యోగం సంపాదించలేకపోతున్నాడని ఆ ఇంటి పెద్ద కొడుకుని ఇంటి నుంచి తరిమేశారు ఆ తల్లిదండ్రులు. అయితే వెల్లగొట్టిన ఆ పెద్ద కొడుకు సీరియల్ కిల్లర్ గా మారాడని చిన్న కొడుకుకు తెలిసి అతన్ని ఎదుర్కోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే. సుహాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో తేజ కాసరపు, అనూష నూతుల, సంజయ్ రథా ప్రధాన పాత్రల్లో నటించారు.

ఒకే ఒక జీవితం(2022): సైన్స్ ఫిక్షన్ మెలోడ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి నిర్మించారు. శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో మెప్పించిన ఈ మూవీలో అమల అక్కినేని అతిథి పాత్రలో నటించారు. అమ్మ సెంటిమెంట్​తో పాటు కామెడీ టైమింగ్ ఈ సినిమాకి హైలైట్స్.

ఆకాశవాణి(2021): అడవిలో ఉంటూ అసలు బయట ప్రపంచంలో సంబంధం లేని గిరిజన తెగకు అనుకోకుండా దొరికిన రెడీయో వాళ్ల జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకువచ్చిందో? చూడాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆ రెడీయోను మాట్లాడే దేవుడిగా ఆ గిరిజనులు పూజించడం మనసుకు హత్తుకుంటుంది.

ప్రియురాలు(2021): వివాహేతర సంబంధం ద్వారా పుట్టిన అమ్మాయి పెద్ద అయ్యాక పెళ్ళయిన అబ్బాయితో ప్రేమలో పడితే పర్యవసానం ఎలా ఉంటుంది? అందులో నుంచి ఆ అమ్మాయి బయటపడిందా లేదా అనేది ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది.

రామారావు ఆన్ డ్యూటీ(2022): రవితేజ ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ చిత్రం 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వ్యవస్థలో ఉండే లోపాలతో పోరాడే ప్రభుత్వ అధికారిగా రవితేజ నటించారు.

ఫస్టాఫ్ డీలా- సెకండాఫ్​పైనే అందరి ఆశలు! ఏం జరుగుతుందో? - Tollywood Second Half

హాలీవుడ్ ఆల్ టైమ్​ క్లాసిక్ మూవీస్- పక్కా ఇన్స్పిరేషన్​! - Inspirational movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.