ETV Bharat / entertainment

టాలీవుడ్ స్టార్లకూ రిలీజ్ డేట్ సెంటిమెంట్- 10 మంది హీరోల సినిమాలు ఒకే తేదీనే - Pavan kalyan Release Sentiment

Telugu Heros Sentiment Release Date: సినిమా రిలీజ్ డేట్​ విషయంలో ఆయా మూవీ మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే టాలీవుడ్​లో పలువురు స్టార్ హీరోలకు మాత్రం రిలీజ్ విషయంలో కొన్ని సెంటిమెంట్​లు ఉంటాయి. అలా తెలుగులో స్టార్ హీరోలు ఒకే డేట్​కు రిలీజ్​ చేసిన సినిమాలేవంటే?

Telugu Heros Sentiment Release Date
Telugu Heros Sentiment Release Date
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 10:51 PM IST

Telugu Heros Sentiment Release Date: సినిమాలు తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాను విడుదల చేయడం కూడా అంతే ముఖ్యం. సరైన సమయం చూసి జనాల్లోకి వదలాలి. అప్పుడే ఆ సినిమాకు మంచి ఆదరణతోపాటు కలెక్షన్లు వస్తాయి. అయితే టాప్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కాకుండా (క్లాష్​ కాకుండా) దర్శక నిర్మాతలు జాగ్రత్తపడుతుంటారు. కానీ గతంలో సినిమాలు చాలా తక్కువ సంఖ్యలో విడుదలయ్యేవి.

అయితే కొన్ని సార్లు కొంత మంది హీరోలకు రిలీజ్ డేట్ల విషయంలో యాదృచ్ఛికంగా కొన్ని విషయాలు కలిసి వస్తాయి. ఎందుకంటే ఆ ఏడాది ఫలానా తేదీన రిలీజ్ అయిన సినిమా సూపర్ హిట్ అయితే ఆ తర్వాత మళ్లీ అదే తేదీకి మరో ఏడాది సినిమా రిలీజ్ అయితే సినిహా హిట్టు కొడుతుంది అనే సెంటిమెంట్​ కూడా ఇండస్ట్రీలో ఉంది. అయితే ఇప్పటివరకు హీరోలు ఒకే డేట్​కు రిలీజ్ చేసిన వేర్వేరు సినిమాలేంటో తెలుసా?

పవన్ కల్యాణ్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది మూవీ 2013 సెప్టెంబర్ 27న విడుదలయ్యింది. సరిగ్గా 11ఏళ్ల తర్వాత 2024 సెప్టెంబర్ 27న ఓజీ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇక పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో నటించిన మూవీ గోపాల గోపాల. ఈ సినిమా 2015 జనవరి 10న విడుదలయ్యింది. మిశ్రమ ఫలితాన్ని రాబట్టింది. 2018 జనవరి 10న విడుదలైన అజ్నాతవాసి మూవీ బిగ్ డిజాస్టర్​గా నిలిచింది.

విజయ్ దేవరకొండ: రౌడీహీరో విజయ్ దేవరకొండ నటించన అర్జున్ రెడ్డి మూవీ 2017 ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మంచి సక్సెస్ ను అందుకుంది. అయితే 2022 ఆగస్టు 25న లైగర్ రిలీజ్ అయిన మూవీ మాత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

వెంకటేశ్: విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన మూవీ కలిసుందాం రా. 2000 జనవరి 14న విడదులై మంచి సక్సెస్​ను అందుకుంది. అయితే దేవీపుత్రుడు మూవీ 2001 జనవరి 14న విడుదలయ్యింది. ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. 2006 జనవరి 14న విడుదలైన లక్ష్మీ మూవీ బిగ్ హిట్ అవ్వగా, 2012 జనవరి 14న వచ్చిన బాడీగార్డ్ మూవీ మాత్రం మిశ్రమ ఫలితాలను అందించింది.

నాగార్జున: నాగార్జున మన్మధుడు మూవీ 2002 డిసెంబర్ 20న విడుదలయ్యింది. 2007 లో డిసెంబర్ 20 డాన్ కమర్షియల్ హిట్ అందుకుంది. 2022 జనవరి 14న విడుదలైన బంగార్రాజు కూడా హిట్ అయ్యింది. 2024 జనవరి 14న వచ్చిన నా సామి రంగ మూవీ కూడా సక్సెస్ అందుకుంది.

బాలకృష్ణ: టాలీవుడ్ హీరో బాలయ్య బాబు నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి 2017 జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 2018 జనవరి 12న రిలీజ్ అయిన జై సింహా మంచి సక్సెస్ అయ్యింది. 2023 జనవరి 13న వచ్చిన వీరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్టయ్యింది.

మహేశ్ బాబు: ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన టక్కరి దొంగ మూవీ 2002 జనవరి 12న విడుదలై ఫెయిల్యూర్​గా నిలిచింది. 2024జనవరి 12న విడుదలైన గుంటూరు కారం మూవీకి నెగెటివ్ టాక్ వచ్చిన కమర్షియల్ గా మాత్రం పర్వాలేదనిపించింది.

అల్లు అర్జున్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమా 2007 జనవరి 12 విడుదలయ్యింది. మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. 2020 జనవరి 12న విడుదలైన అల వైకుంఠపురుములో మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా 1990 మే 9న విడుదలై మంచి హిట్ గా నిలిచింది. గ్యాంగ్ లీడర్ సినిమా 1991 మే 9న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నాని: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు 2015 మార్చి 21న విడుదలయ్యాయి. ఇందులో ఎవడే సుబ్రహ్మణ్యం విజయం సాధించగా జెండాపై కపిరాజు ఫెయిల్ అయ్యింది.

రవితేజ: మాస్ మహారాజ రవితేజ నటించిన బలాదూర్ మూవీ 2008 ఆగస్టు 14న విడుదలయ్యింది. యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. 2009లో ఆంజనేయులు సినిమా కూడా ఆగస్టు 14న విడుదలై కమర్షియల్ హిట్ గా నిలిచింది.

ప్రభాస్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వర్షం మూవీ 2004 జనవరి 14న విడుదలై మంచి హిట్ ను సొంతం చేసుకుంది. 2007 జనవరి 14నే రిలీజ్ అయిన యోగి మూవీ మాత్రం మిశ్రమ ఫలితాలను సాధించింది.

రామ్ పోతినేని: ఎనర్జిటిక్​ స్టార్ రామ్ మూవీ మస్కా 2009 జనవరి 14న విడుదలయ్యింది. ఈ మూవీ కమర్షియల్ హిట్ ను అందుకుంది. 2021 జనవరి 14న విడుదలైన రెడ్ కూడా కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కేవలం రూ. 2 కోట్ల కలెక్షన్స్ - ఆ ఒక్క సినిమాతో రజనీ బీటౌన్ కెరీర్ డౌన్!

సెలక్టివ్ రోల్స్​కు సాయి పల్లవి సై - సినిమాల్లో కచ్చితంగా ఆ ఎలిమెంట్ ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.