First 100 Crore Female Oriented Movie: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా ఇండియన్ సినిమా ఎక్కడున్నా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీకి ఆదరణ తక్కువే! హీరోలకే ప్రాధాన్యతనిస్తూ నడిచే సినిమా రోజుల నుంచి లేడీ ఓరియెంటెడ్ సినిమా వైపు నెమ్మదిగా అడుగులేస్తుంది చిత్ర పరిశ్రమ. ప్రొడ్యూసర్లు కథను నమ్మి పెట్టుబడి పెట్టడం, దానికి తగ్గట్టుగా ప్రేక్షకాదరణ లభించడమే ఇందుకు కారణం.
అలా ఏకంగా ఓ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసిందంటే అది కచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇది తెలియగానే ఆ సినిమా 'కేరళ స్టోరీ' లేగా 'అరుంధతి' అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇవేవీ కాదు. ఆ సినిమా రింగుల జుట్టు కంగనా రనౌత్ నటించిన సినిమా 'తను వెడ్స్ మను రిటర్న్'. డ్యూయెల్ రోల్‌లో కంగనా కనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు వసూలు చేసింది. కాగా, లేడి ఓరియెంటెడ్‌లో రూ.100+ వసూల్ చేసిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.
ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో 'తను వెడ్స్ మను'కి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 258కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఒక్క ఇండియాలోనే రూ. 150.71కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో ఆర్ మాధవన్, జిమ్మీ షీర్గిల్, దీపక్ దోబ్రియల్, స్వర భాస్కర్, ఇజాజ్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో కంగనకు ఉత్తమ నటి, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైలాగ్స్ రైటర్‌గా హిమాన్షు శర్మకు జాతీయ సినిమా అవార్డులు దక్కాయి.
ఇదేగాక, బాలీవుడ్‌లో ఇంకొన్ని ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ వచ్చాయి. కానీ, 'తను వెడ్స్ మను రిటర్న్' వాటన్నిటి కంటే ముందు రూ. 100కోట్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. జైరా వసీం, అమీర్ ఖాన్, మెహర్ విజ్, రాజ్ అర్జున్ నటించిన సినిమా రూ. 900కోట్లు వసూలు చేసింది. ఇంకా అలియా భట్ నటించిన 'రాజీ' సినిమా కూడా రూ.100 కోట్ల సినిమా క్లబ్‌లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజై రూ.207 కోట్లు వసూలు చేసింది.
అదా శర్మ లీడ్ రోల్‌లో నటించిన 'ది కేరళ స్టోరీ' గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచి రూ.303 కోట్లు సాధించింది. 2023లో ప్రొడ్యూసర్‌కు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇదే. కొన్ని మీడియా కథనాలను బట్టి ఈ చిత్రం కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు సమాచారం.
ఫస్టాఫ్ డీలా- సెకండాఫ్‌పైనే అందరి ఆశలు! ఏం జరుగుతుందో? - Tollywood Second Half
రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లాలా? ఈ సినిమాలు చూస్తే మీ ఒత్తిడంతా ఉఫ్! - Stress Buster Movies