RJ Balaji Suriya Movie : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో. ఆయన నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా రిలీజై మంచి ఫలితాన్ని అందుకుంటుంది. పైగా ఆయన గత కొంతకాలంగా వైవిధ్యామైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. తాజాగా సూర్య నటించనున్న నటించనున్న 45వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. కమెడియన్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య తన తర్వాతి చిత్రాన్ని చేస్తున్నారు.
కాగా, ఆర్జే బాలాజీ రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన మల్టీ టాలెంటెడ్. యాక్టర్‌గా, సింగర్‌గా, డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ నయనతారతో కలిసి ఆయన చేసిన అమ్మోరు తల్లి బాక్సాఫీస్ ముందు మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీట్ల విశేషం అనే చిత్రాన్ని సత్యరాజ్‌తో కలిసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు మూడోసారి స్టార్ హీరో సూర్యతో కలిసి చేసేందుకు సిద్ధమైపోయారు. ఈ విషయాన్ని బాలాజీ తెలియజేస్తూ, తనకు అవకాశం ఇచ్చిన సూర్యకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ మూవీగా ఇది రానుందని తెలుస్తోంది. దాదాపు ఏడాదికి పైగా స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన లొకేషన్లను కూడా లాక్ చేసేశారట. 120 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకున్నరట. నవంబర్‌లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. 2025 సెకండాఫ్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే చెప్పనున్నారు
Kanguva release date : ప్రస్తుతం సూర్య నటించిన కంగువ విడుదలకు రెడీగా ఉంది. నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ దర్శకత్వం వహించారు. ఇకపోతే సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తోంది. ఈ మూవీ గ్యాంగ్‌స్టర్ కథా నేపథ్యంలో రూపొందుతోంది.
ఒకే ఫ్రేమ్‌లో రజనీ, సూర్య, ప్రభాస్ - ఎందుకంటే?
'పుష్ప 2'పై దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే అప్డేట్ - ఫ్యాన్స్‌కు పండగే!