SV Rangarao First Movie : టాలీవుడ్ లో తొలి తరం నటుల్లో ఎస్వీ రంగారావుకు గొప్ప స్థానం ఉన్న విషయం తెలిసిందే. విలక్షణ నటనతో పాతాళభైరవి సినిమా నుంచి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సహజమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఎస్వీఆర్ ఒక సందర్భంలో తన తొలి సినిమా అనుభవం గురించి ఒక వ్యాసం రాశారు.
ఎస్వీఆర్ నటించిన తొలి చిత్రం వరూధిని. అందులో రంగారావుది ప్రవరాఖ్యుని పాత్ర అదే మేకప్‌తో సెట్లో అడుగుపెట్టారు. ఆ చిత్రం షూటింగ్ సేలం మోడరన్ థియేటర్స్‌లో జరిగింది. సెట్లో అడుగుపెట్టిన తర్వాత అందరూ తన వైపు చూస్తున్నారనే సృహతో భయం మొదలైందని ఆ తర్వాత అక్కడ ఉన్న నిశబ్ద వాతావరణం ఆ భయాన్ని మరింత పెంచిందని వాపోయారు. అక్కడ ఒక్కసారి లైట్స్ వేయగానే ఆ సినిమా దర్శకుడు రామనందం "ఆ స్థంభం దగ్గరకు వెళ్లి నిలబడు" అని అన్నారట. ఎస్వీఆర్ తొలిసారిగా ఆయన గొంతు విన్నారట అప్పటివరకు మనసులో ఎదో మూలలో ఉన్న భయం ఇంకా ఎక్కువ అయింది.
ఎస్వీఆర్ గారితో నటించాల్సిన అమ్మాయి ఆయన పక్కన వచ్చి నిల్చోగానే ఆయన గొంతు ఎండిపోయిందట, అంతవరకు ఆడ వేషధారణలో ఉన్న మగవారితో నటించే అలవాటున్న ఆయనకు నిజమైన ఆడవారితో నటించాలనే విషయం అర్ధమైంది. అందుకే ఆ అమ్మాయికి కొంచెం దూరంగా జరిగారట, ఆ వెంటనే రామనందంగ " దూరంగా వెళ్లద్దు ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది" అంటూ చమత్కరించారట.
ఆ మాటకు సెట్లో ఉన్నవాళ్లు నవ్వుతుంటే ఆయన మీద ఎస్వీఆర్ గారికి విపరీతమైన కోపం వచ్చిందట. ఆ వెంటనే కో డైరెక్టర్ వచ్చి డైలాగ్స్ చెప్పమని అడగ్గానే ఆ హడావుడిలో ఉన్న ఎస్వీఆర్ తనకు డైలాగ్స్ తెలుసని ఉక్రోషంగా చెప్పారట. ఆ మాట అనగానే రామనందం అందుకుని వచ్చినప్పుడు చెప్పకుండా ఎందుకు నిల్చున్నావని ఎస్వీఆర్ను ప్రశ్నించారట.
ఎస్వీఆర్ కోపాన్ని దిగమింగుకుని తల దించుకుని డైలాగ్స్ చెప్పడం మొదలుపెట్టగానే మళ్లీ రామనందంపక్కనున్న ఆవిడ ముఖం చూసి చెప్పమన్నారట, అలవాటు లేని ఆ పనిని ఎలాగోలా పూర్తి చేసి ఆరోజు షూటింగ్ అయిందని పించారట ఎస్వీఆర్. ఇక సినిమాల్లో నటన తన వల్ల కాదని ఎస్వీఆర్ ఆరోజు రాత్రి బండికి తిరిగి వెళ్లిపోదామనుకున్న విషయం రామనందం తెలిసి, ఆయన వచ్చి ఎస్వీఆర్ గారికి ఓదార్పునిచ్చి ధైర్యం చెప్పారట. అలా తొలి సినిమా అనుభవాలు చాలా నేర్పాయని ఎస్వీఆర్ గారు ఆ వ్యాసంలో పేర్కొన్నారు.