ETV Bharat / entertainment

భర్త హీరో సూర్యతో విడాకులు - క్లారిటీ ఇచ్చిన జ్యోతిక - సూర్య జ్యోతిక డివొర్స్​

Suriya Jyothika Divorce : తన భర్య హీరో సూర్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తోన్న వార్తలపై నటి జ్యోతిక స్పందించింది. ఆ వివరాలు

భర్త హీరో సూర్యతో విడాకులు - క్లారిటి ఇచ్చిన జ్యోతిక

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 4:37 PM IST

Updated : Jan 30, 2024, 4:47 PM IST

Suriya Jyothika Divorce : సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎప్పుడు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా డివోర్స్​ తీసుకోబోతున్నారనే పుకార్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిలో ప్రస్తుతం స్టార్ కపుల్ సూర్య-జ్యోతిక పేర్లు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలకు జ్యోతిక చెక్​ పెట్టింది. వివరాల్లోకి వెళితే.. 2006, సెప్టెంబరు 11న పెళ్లి బంధంతో ఒకటైన ఈ జంటకు సినీ అభిమానుల్లో ఫుల్​ క్రేజ్‌ ఉంటుంది. రీల్​ లైఫ్​లో తమ యాక్టింగ్​తో అభిమానుల మనసును ఎంతగా దోచుకున్నారో అలాగే నిజ జీవితంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు.

అయితే కొంత కాలంగా ఈ జంట వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ స్టార్ కపుల్​ విడిపోతున్నారని, త్వరలోనే డివొర్స్​ తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిక తన ఇన్​స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసి ఈ పుకార్లకు ముగింపు పలికింది. రీసెంట్​గా ఈ జంట ఫిన్లాండ్ పర్యటనకు వెళ్లారు. ఇప్పుడా ఆ పర్యటన వీడియోని '2024 –(A year full of travel)' అనే క్యాప్షన్​తో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సూర్య జ్యోతిక హాలిడే ట్రిప్​ను కలిసి ఫుల్​గా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. తమ విడాకులకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, తమ బంధం చాలా గట్టిదని అనే అర్థం వచ్చేలా ఈ వీడియో పోస్ట్ చేసినట్లు అర్థమైంది.

ఇక సినిమాల విషయానికొస్తే జ్యోతిక ఇటీవలే మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టితో కలిసి 'కాథల్: ది కోర్' అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్​లో అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'షైతాన్' చిత్రంలో నటిస్తోంది. సూర్య త్వరలోనే 'కంగువా' అనే భారీ బడ్జెట్​ చిత్రంతో ఆడియెన్స్​ ముందుకు రానున్నారు. దీని తర్వాత ఓం ప్రకాశ్ మెహతా, సుధా కొంగరతోనూ చెరో సినిమా చేయనున్నారు. ఇవి కూడా భారీ బడ్జెట్​లో తెరకెక్కనున్నాయి.

ఎన్టీఆర్​తో 'వార్​ 2' షూటింగ్​ - సూపర్ హింట్ ఇచ్చిన హృతిక్​ రోషన్​

సీక్రెట్​ రివీల్​ - ఎంగేజ్మెంట్ చేసుకున్న 'తీన్​మార్' హీరోయిన్​ ?

Last Updated : Jan 30, 2024, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.