ETV Bharat / entertainment

సన్​రైజర్స్ టీమ్​తో మహేశ్​ బాబు - ఫొటోలు చూశారా? - Mahesh Babu Sunrisers - MAHESH BABU SUNRISERS

IPL 2024 Superstar Mahesh Babu Sunrisers Hyderabad : సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా సన్​రైజర్స్ హైదరాబాద్​ ప్లేయర్స్​ను కలిశాడు. ఫొటోలు చూశారా?

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 8:12 PM IST

IPL 2024 Superstar Mahesh Babu Sunrisers Hyderabad : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు క్రికెట్‌ ప్లేయర్‌లే కాదు మూవీ స్టార్స్‌ కూడా క్రేజ్‌ తీసుకొచ్చారనే చెప్పాలి. ప్రతి ఐపీఎల్ సీజన్‌ ప్రారంభోత్సవంలో పాపులర్‌ హీరో, హీరోయిన్‌లు, మ్యూజిక్‌ డైరెక్టర్లు, సింగర్‌లు పెర్‌ఫార్మ్‌ చేయడం చూసే ఉంటారు. అంతే కాదు హోమ్‌ టీమ్‌ ఆడుతున్న మ్యాచ్‌లకు హాజరై ఫ్యాన్స్‌ను ఉత్సాహ పరుస్తుంటారు. తరచూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ చూడటానికి టాలీవుడ్‌ సీనియర్‌ హీరో వెంటేశ్​ సహా తదితరులు హాజరవుతుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేశ్​ బాబు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్​ను కలిశారు.

సూపర్ స్టార్ మహేశ్​ బాబు కూడా క్రికెట్ అభిమాని అన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను కలిశారు. ఇద్దరూ కలిసి ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను కమ్మిన్స్‌ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో పోస్టు చేశాడు. ‘లవ్లీ టూ మీట్‌ ద ప్రిన్స్‌ ఆఫ్‌ టాలీవుడ్‌! @urstrulymahesh’ అనే క్యాప్షన్‌ యాడ్‌ చేశాడు. ఈ పోస్టును మహేష్‌ బాబు రీట్వీట్‌ చేశారు. ‘ఎన్‌ అబ్సొల్యూట్‌ ఆనర్‌! ఎ బిగ్‌ ఫ్యాన్‌!’ అని రెస్పాండ్ అయ్యారు. అలానే ఇతర ప్లేయర్స్​తోనూ మహేశ్ ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

దూసుకెళ్తున్న సన్‌రైజర్స్‌ - పాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. గ్రూప్-స్టేజ్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో విజయం సాధించింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు రికార్డు(ఆర్సీబీపై 287)ను సొంతం చేసుకుంది. ఏకంగా మూడు సార్లు 250కి పైగా పరుగులు చేసింది. మొదటి మూడు మ్యాచ్‌లలో రెండింట్లో ఓడిపోయిన సన్‌రైజర్స్‌ పేలవంగా టోర్నీ మొదలుపెట్టి అనంతరం వరుస విజయాలు అందుకుంది. సంచలన ప్రదర్శనకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పాయింట్స్‌ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్‌కు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మెరుపు ఆరంభాలను అందిస్తున్నారు. మార్‌క్రమ్‌, హెన్రిచ్ క్లాసెన్ పవర్‌ హిట్టింగ్‌ తోడై జట్టు భారీ స్కోర్‌లు సాధిస్తోంది.

రాజమౌళి సినిమాలో సూపర్‌స్టార్ - రీసెంట్​గా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో మహేళ్​ బాబు గుంటూరు కారంలో కనిపించారు. ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళితో కలిసి పని చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది.

లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల - Sreeleela New Movie

పవర్​ఫుల్​గా రజనీ లోకేశ్ మూవీ టైటిల్ టీజర్ - డైలాగ్స్​, యాక్షన్​ మోడ్​ అదిరిందంటే! - Thalaivar 171 Title

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.