ETV Bharat / entertainment

'షూటింగ్​ సెట్​లో బాగా ఇబ్బంది పెట్టింది!' - షారుక్‌ కూతురిపై ఆ హీరో కామెంట్స్‌! - SUHANA KHAN JIGRA VEDANG RAINA

'ది ఆర్చీస్'​ షూటింగ్ సమయంలో ఆ అబ్బాయిలను ఇబ్బంది పెట్టిన షారుక్ కూతురు సుహానా ఖాన్!

suhana Khan
suhana Khan (Source Associated Press and ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 4:13 PM IST

Suhana Khan Jigra Vedang Raina : బాలీవుడ్​ బాద్ షా షారుక్ ఖాన్ కూతురి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ది ఆర్చిస్‌తో సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే ఇది థియేటర్లలో విడుదల కాలేదు. ఇదే సినిమాతో వేదాంగ్ రైనా కూడా పరిచయమయ్యాడు. అయితే తాజాగా అతడు ది అర్చీస్​లో నటించిన సుహానా ఖాన్​, ఖుషి కపూర్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మేకప్‌ విషయంలో సుహానా ఖాన్‌ ఎక్కువ సమయం తీసుకుంటుందని అన్నాడు.

'సుహానా వల్ల మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా?' అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వేదాంగ్ రైనా స్పందించాడు. "సుహానా మంచి వ్యక్తి. అందరితో చక్కగా కలిసిపోతుంది. అయితే ఆమె రెడీ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. సెట్‌లో ఉన్న అబ్బాయిలు 15 నిమిషాల్లో రెడీ అయిపోతారు. ఆ తర్వాత ఆమె కోసం దాదాపు 40 నిమిషాలకు పైగా ఎదురు చూసేవాళ్లు. జుట్టు బాలేదు, మేకప్‌ సరిగా లేదంటూ అంటూ ఆమె టీమ్‌ టేక్స్‌ మధ్యలో అంతరాయం కలిగించేవారు. దీంతో మేము కాస్త ఇబ్బంది పడ్డాం. వాస్తవానికి సుహానాది తప్పు కాదు. ఆమె పాత్ర అలాంటిది మరి. పాత్రకు తగ్గట్టుగా ఆమె మేకప్‌ చేసుకోవాలి కదా." అని వేదాంగ్‌ పేర్కొన్నాడు.

ఖుషి కపూర్‌ గురించి మాట్లాడుతూ - ఆమె చాలా స్వీట్‌ పర్సన్ అని చెప్పుకొచ్చాడు వేదాంగ్​. "అందరితో ఆమె సరదాగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆత్మన్యూనతకు లోనవుతుంది. తనని తానే తక్కువ చేసుకునేలా అంచనా వేసుకుంటుంది." అని చెప్పాడు. కాగా, ది ఆర్చిస్‌ షూటింగ్ సమయం నుంచే వేదాంగ్‌ - ఖుషి ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Alia Bhatt Jigra Movie : ప్రస్తుతం వేదాంగ్‌ రైనా నటించిన లేటెస్ట్ మూవీ జిగ్రా. యాక్షన్‌ డ్రామాగా ఇది ముస్తాబైంది. వాసన్‌ బాలా దర్శకత్వం వహించారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. తమ్ముడు కోసం అక్క చేసే పోరాటం నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. అలియా భట్‌ అక్క పాత్రలో నటించింది. అక్టోబర్‌ 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

'స్పిరిట్' నుంచి నాలుగు అప్డేట్స్!​ - రంగంలోకి ఇద్దరు మెగాస్టార్స్​, ఓ బాలీవుడ్ హీరోయిన్

'రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్​ సమంతదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.