Rashmika Anand Devarakonda: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతేడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'బేబీ' తర్వాత ఆనంద్ నుంచి రానున్న సినిమా కావడం వల్ల దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ ఉదయ్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రీసెంట్గా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు స్టార్ హీరోయిన్ రష్మికా మంధన్నా హాజరయ్యారు.
అయితే ఈవెంట్లో రష్మిక- ఆనంద్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మనమంతా ఓ ఫ్యామిలీ అని, తాను ఎక్కువగా ఆనంద్‌పై ఆధారపడతానని రష్మిక అన్నారు. అయితే ఆనంద్ సోదరుడు విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్లో ఉన్నారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈమె కామెంట్స్ తెగ వైరలయ్యాయి. వాళ్ల మధ్య ఏం జరుగుతోందని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. కాగా, రష్మిక కామెంట్స్‌పై ఆనంద్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
'నా సినిమా ఈవెంట్లలో రష్మిక పాల్గొంది రెండుసార్లే (నవ్వుతూ). మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్. అందుకే మొన్న ఈవెంట్లో మనం ఫ్యామిలీ అని ఆమె అన్నారు. ఆ అనుబంధంతోనే నా సినిమా వేడుకలకు వస్తుంటారు. అయితే నాపై ఆధారపడుతుంటానని ఎందుకన్నారో నాకూ తెలియదు' అని ఆనంద్ అన్నారు.
అసలేం జరిగిందంటే? ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన రష్మికను 'మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు' అని ఆనంద్ అడిగారు. ఈ ప్రశ్న వినగానే వెనక నుంచి ఆడియన్స్ 'రౌడీ బాయ్' అంటూ అరవడంతో ఆమె సిగ్గుపడిపోయారు. దీనికి సమాధానంగా 'ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా. ఇలా నన్ను స్పాట్లో పెడితే ఎట్లా అంటూ నవ్వుకుంది. ఫైనల్‌గా రౌడీ(విజయ్ దేవరకొండ)' అని చెప్పారు. ఇక స్టేజ్‌పై మాట్లాడుతున్న క్రమంలో 'నేను ఎక్కువగా ఆనంద్‌పై ఆధారపడతా' అని ఓ సందర్భంలో చెప్పారు.
ఇక ఈ సినిమాలో ఆనంద్‌కు జంటగా ప్రగతి శ్రీవాస్తవ నటిస్తున్నారు. కమెడియన్ వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 31న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా మూవీ రిలీజ్ కానుంది.
రష్మిక ఫేవరెట్ కో స్టార్ ఎవరు? - ఇరికించేసిన ఆనంద్ దేవరకొండ!
అలాంటి సినిమాలు చూసినా వేస్ట్!: విశ్వక్ సేన్ - Viswak Sen Gangs Of Godavari