ETV Bharat / entertainment

SSMB 29 కోసం జక్కన్న షాకింగ్ డెసిషన్​! ​- టైటిల్ ఛేంజ్​ - కొత్త పేరేంటంటే? - rajamouli mahesh movie budget

SSMB 29 Title Change : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్​ ఎదురు చూసే సినిమాల్లో SSMB 29 కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. అయితే సినిమాకు సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా కోసం జక్కన్న ఓ కొత్త డెసిషన్ తీసుకున్నారు. వర్కింట్​ టైటిల్​ను మార్చబోతున్నారని తెలిసింది. ఆ వివరాలు.

SSMB 29 కోసం జక్కన్న షాకింగ్​​ - టైటిల్ ఛేంజ్​ - కొత్త పేరేంటంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 9:18 AM IST

SSMB 29 Title Change : SSMB 29 ఇండియన్ సినిమా ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్​గా ఉన్న మూవీ లవర్స్​ ఎదురుచూస్తున్న చిత్రమిది. అమెజాన్ ఫారెస్ట్ అండ్​ యాక్షన్ అడ్వెంచర్​ బ్యాక్​డ్రాప్​తో రాబోతుంది. ఆర్​ఆర్​ఆర్​ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్​ను తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించనుండడంతో యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలీ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది సోషల్​ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ మధ్యే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైనట్లు రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్​ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే మహేశ్​ కూడా తన లుక్స్​ను, శరీరాకృతిని మార్చేశారు. ఫారెన్ వెళ్లి మరీ శిక్షణ తీసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను రూపొందించేందుకు జక్కన్న ఫుల్ ప్లాన్డ్​గా ముందుకెళ్తున్నారు. ఎక్కడ రాజీ పడకుండా మూవీని తెరకెక్కించేలా దాదాపు రూ.1000కోట్లు ఖర్చు పెట్టనున్నారట.

అయితే గత కొన్ని రోజులుగా రాజమౌళి ఈ మూవీ కోసం తన మొత్తం టీమ్​ను మార్చబోతున్నారని​ ప్రచారం జోరుగా సాగుతోంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం ఎం కీరవాణిని తప్ప ఇతర టీమ్​ను జక్కన్న మార్చేశారట. ఈ సారి పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్​గా, ఆర్సి కమల్ కన్నన్ వీఎఫ్ఎక్స్ సూపర్​వైజర్​గా, తమ్మి రాజు ఎడిటర్​గా, మోహన్ బింగి ప్రొడక్షన్ డిజైనర్​గా, రాజమౌళి సతీమణి రమ కాస్ట్యూమ్ డిజైనర్​గా బాధ్యతలు చూసుకోనున్నారట. ఇండోనేషియాకు చెందిన ఓ నటి హీరోయిన్​గా నటించనుందని అంటున్నారు. అయితే దీనిపై ఎటువంటి అధికార ప్రకటన రాలేదు.

ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ చిత్ర వర్కింగ్ టైటిల్​ను మార్చబోతున్నారట. ఇంకా థియేటర్ టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్టును మొదటి నుంచి SSMB29 అనే పిలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు జక్కన్న ఈ SSMB29ను SSRMBగా మార్చబోతున్నారని బయట కథనాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం రాజమౌళి క్రేజ్ అని బయట టాక్ నడుస్తోంది. ఎందుకంటే మహేశ్​ క్రేజ్​ టాలీవుడ్​ వరకే పరిమితమైతే జక్కన్న క్రేజ్ ఆర్​ఆర్​ఆర్​తో వరల్డ్​ వైడ్​గా ఉంది. అందుకే ఈ వర్కింగ్​ టైటిల్​ను మార్చబోతున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మహేశ్‌ - రాజమౌళి మూవీ టెక్నికల్‌ టీమ్‌ ఫుల్ లిస్ట్​ - ఆ ఒక్కరు తప్ప అంతా ఛేంజ్​!

వీకెండ్ సర్​ప్రైజ్​ - OTTలోకి సడెన్​గా వచ్చేసిన రూ.470కోట్ల స్టార్ హీరో సినిమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.