ETV Bharat / entertainment

రాజమౌళి దంపతులకు మరో అరుదైన గౌరవం - SS Rajamouli Oscar Academy - SS RAJAMOULI OSCAR ACADEMY

SS Rajamouli Oscar Academy : దర్శకధీరుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్స్ అకాడమీలో మెంబర్‌గా ఉండేందుకు ఆయనకి ఆహ్వానం అందింది. రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా ఈ ఆహ్వానం అందడం విశేషం.

source Getty Images
Rajamouli (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 9:31 AM IST

Updated : Jun 26, 2024, 9:42 AM IST

SS Rajamouli Oscar Academy : దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈగ, బాహుబలి 1, 2 చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచవేదికపై సగౌరవంగా నిలబెట్టారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకున్నారు. హాలీవుడ్​ అంతా మనవైపు తిరిగి చూసేలా చేశారు.

అయితే తాజాగా జక్కన్న మరో ఘనతను కూడా అందుకున్నారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(AMPAS) సింపుల్‌గా చెప్పాలంటే ఆస్కార్స్ అకాడమీలో మెంబర్​గా ఉండేందుకు రాజమౌళికి ఆహ్వనం దక్కింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 57 దేశాల నుంచి 487 మందికి ఈ ఆహ్వానం దక్కగా, వీరిలో జక్కన్నతో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా అకాడమీ నుంచి ఆహ్వానం రావడం మరో విశేషం. దర్శకుల విభాగంలో రాజమౌళికి, కాస్టూమ్ డిజైనర్స్ కేటగిరీలో రమా రాజమౌళికి ఈ అరుదైన గౌరవం దక్కనుంది. దీంతో 2025 ఆస్కార్‌లలో ఓటు వేసేందుకు ఈ మెంబర్లంతా అర్హత పొందారు. కాగా, ఈ గౌరవం దక్కించుకున్న రాజమౌళి దంపతులకు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.

ఇంకా ఎవరెవరికి చోటు దక్కిందంటే? - రాజమౌళి, రమా రాజమౌళితో పాటు మన దేశం తరఫున రితేశ్​ సిధ్వాని, షబానా అజ్మీ, రీమా దాస్, రవి వర్మన్, ఆనంద్ కుమార్ టక్కర్, శీతల్ శర్మ, హేమల్ త్రివేది, నిషా పహుజా, గితేశ్​ పాండ్యాలకు కూడా అకాడమీ నుంచి ఆహ్వానం దక్కింది. గత ఏడాది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్​ రామ్ చరణ్, చంద్రబోస్, ఎంఎం కీరవాణి, కె కె సెంథిల్ కుమార్, సాబు సిరిల్ వంటి వారికి అకాడమీలో చోటు దక్కింది.

SSMB 29 Movie Update : ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో SSMB 29 సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్​ జరుపుకుంటోంది. సెట్స్​పైకి ఎప్పుడు వెళ్తుందో స్పష్టంగా తెలీదు. ఫారెస్ట్ అడ్వెంచర్​ బ్యాక్​డ్రాప్​తో మూవీ తెరకెక్కనుంది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

దీపిక ఫేవరెట్​ తెలుగు హీరో ఎవరో తెలుసా? - ప్రభాస్ మాత్రం కాదు! - Kalki 2898 AD Deepika Padukone

రష్మికకు బాలీవుడ్​లో మరో సూపర్​ ఆఫర్​!

Last Updated : Jun 26, 2024, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.