ETV Bharat / entertainment

వేశ్యగా మారిన తెలుగు హీరోయిన్ - ఫుల్​ హ్యాపీ అంటూ కామెంట్స్! - Sobhita Dhulipala Monkey Man

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 12:56 PM IST

గూఢచారి, మెడ్ ఇన్ హెవెన్ లో విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకులను మెప్పించిన శోభిత మంకి మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో వేశ్య పాత్రలో నటించడం గర్వంగా ఉందని తెలిపింది శోభిత.

Sobhita
Sobhita

Sobhita Dhulipala Monkey Man : తెలుగుమ్మాయిలు టాలీవుడ్​లో హీరోయిన్​గా నిలదొక్కుకోవడమే కష్టం అనుకుంటున్న పరిస్థితి నుంచి టాలీవుడ్​లోనే కాదు బాలీవుడ్​లో కూడా ఎన్నో మంచి పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది శోభిత. 2013లో దేశం తరపున మిస్ ఎర్త్ పోటీల్లో పాల్గొన్న శోభిత అందులో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత 2016లో రామన్ రాఘవ్ 2.0 సినిమాతో వెండితెరకు పరిచయం అయిన శోభిత తెలుగులో గూఢచారి సినిమాతో టాలీవుడ్​కు పరిచయమైంది. నైట్ మేనేజర్ సిరీస్​కు బెస్ట్ యాక్ట్రెస్ ఓటిటి అవార్డును కూడా సొంతం చేసుకుంది. గూఢచారి, మేడ్ ఇన్ హెవెన్, ఘోస్ట్ స్టోరీస్, నైట్ మేనేజర్, పోన్నియన్ సెల్వన్ వంటి సినిమా/సిరీస్​లో ప్రధాన పాత్రలు చేసిన శోభిత ఇప్పుడు సరాసరి హాలీవుడ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.

నటుడు దేవ్ పటేల్ (స్లమ్ డాగ్ మిలియనీర్) స్వీయ దర్శకత్వంలో వచ్చిన మంకి మ్యాన్ సినిమాలో ఒక వేశ్య పాత్రలో నటించింది శోభిత. ఈ సినిమా ఏప్రిల్ 5న అమెరికాలో విడుదలై అక్కడ పాజిటివ్ టాక్(Monkey Man Review) సొంతం చేసుకుంది. ఇండియాలో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం శోభిత అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో సీత అనే వేశ్య పాత్రలో నటించిన శోభిత - సినిమాలో తనది ప్రధాన పాత్ర అని, అలాంటి పాత్రలో నటించినందుకు గౌరవంగా అనిపించిందని చెప్పింది. ఈ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయని దేవ్ పటేల్​తో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవ్ 2.0 కన్నా ముందే ఈ మంకి మ్యాన్ సినిమాకు శోభిత ఆడిషన్ ఇచ్చినా ఈ సినిమా నిర్మాణానికి ఇంత సమయం పట్టింది. ఎట్టకేలకు ఈ మధ్యే హాలీవుడ్​లో రిలీజైంది. ఇంకా ఈ చిత్రంలో దేవ్ పటేల్, శోభితతో పాటు సికందర్ ఖేర్, అదితి కల్ కుంటే, మకరంద్ దేశ్ పాండే కూడా నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ వారం థియేటర్​/ఓటీటీలో 16 సినిమాలు - ఆ మూడింటిపైనే అందరికీ స్పెషల్ ఫోకస్ - This week OTT Releases

అమ్మోరు గెటప్​లో బన్నీ విశ్వరూపం - గంగమ్మ జాతరలో ఒక్కొక్కరికి పూనకాలే! - Pushpa 2 Teaser

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.