Siddharth Emotional Video : కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో ఎమోషనలయ్యారు. 'చిత్తా' (చిన్నా) సినిమాకు గాను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందుకున్న తర్వాత అదే ఈవెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినిమాను ఆదరించిన ఆడియెన్స్‌కు ధన్యవాదాలు చెప్పారు. అయితే ఈ సినిమాను చూసి పలువురు డిస్టర్బ్ అయ్యారంటూ కామెంట్ చేశారని అది విని ఆయనకు బాధ కలిగిందని అన్నారు.
ఇటీవలే హిట్ అయిన ఓ బాలీవుడ్ మూవీని మాత్రం కొంతమంది ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారని అన్నారు. మనసుని హత్తుకునే కథతో సినిమా చేస్తే మాత్రం ఇబ్బందిగా అనిపించింది. సినిమా చూడలేకపోయామని కామెంట్స్ చేశారన్నారు. అది డిస్టర్బెన్స్ కాదని సిగ్గు చేటు మనస్తత్వం అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
గతంలోనూ ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో సిద్ధార్థ్ ఎమోషనలయ్యారు. " ఈ సినిమాను నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని సెన్సార్ చేశాం. తొలిసారి కన్నడ భాష నేర్చుకుని డబ్బింగ్ చెప్పాను. కర్ణాటకకు వెళ్లి ప్రెస్‌మీట్ పెడితే 'నువ్వు తమిళ్ వాడివి గెట్ అవుట్' అన్నారు. ' మీ భాష నేర్చుకుని, కొత్తగా ఒక నటుడు మీ ముందుకు వస్తుంటే గెట్ అవుట్' అంటారేంటి అనిపించింది. నా ప్రెస్‌మీట్ ఆపేశారు. నవ్వుతూ నేను బయటకు వెళ్లిపోయా. తర్వాత చాలా మంది సారీ చెప్పారు. కొందరు థాంక్స్ చెప్పారు" అని సిద్ధార్థ్ అన్నారు.
Siddharth Chittha Cast : 'టక్కర్' తర్వాత సిద్ధార్థ్ 'చిత్తా' అనే సినిమాలో నటించారు. ఎస్.యు.అరుణ్‌కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. చిన్న పిల్లలపై జరుగుతోన్న లైంగిక దాడుల అనే కాన్సప్ట్‌తో ఈ సినిమాను మేకర్స్ ఎంతో చక్కగా రూపొందించారు. అయితే సిద్ధార్థ్ ఇందులో యాక్ట్ చేయడమే కాకుండా ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించారు. ఇందులో సిద్ధార్థ్‌తో పాటు నిమిషా సజయన్, సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు.