ETV Bharat / entertainment

రెండో బాయ్​ఫ్రెండ్​తో బ్రేకప్​ - శ్రుతిహాసన్​ అందుకే స్పందించలేదా? - Shruti Hassan Sanatanu Hazarika - SHRUTI HASSAN SANATANU HAZARIKA

Shruti Hassan Ex boyfriend Santanu Hazarika : శ్రుతిహాసన్​తో బ్రేకప్​పై తాజాగా శాంతను హజారిక మాట్లాడిన సంగతి తెలిసిందే. కానీ శ్రుతిహాసన్ మాత్రం రియాక్ట్ కాలేదు. అయితే ఆమె ఎందుకు రియాక్ట్ కాలేదో గల కారణాన్ని తెలియజేస్తూ కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు స్టోరీలో.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 5:20 PM IST

Updated : Apr 29, 2024, 5:26 PM IST

Shruti Hassan Ex boyfriend Santanu Hazarika Break UP : శ్రుతిహాసన్ తన రెండో బాయ్​ఫ్రెడ్​ శాంతను హజారికతో బ్రేకప్ చేసుకుందని రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా అతడితో రిలేషన్​షిప్​లో ఉన్న ఆమె రీసెంట్​గా గుడ్ బై చెప్పేసిందని సోషల్ మీడియా కోడైకూస్తోంది. సమంత - నాగ చైతన్యల లాగే వీళ్లిద్దరూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అయితే ప్రియుడితో విడిపోవడంపై శ్రుతి ఇప్పటివరకూ ఎటువంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. కానీ ఈ విషయంపై శాంతను మాత్రం స్పందించాడు. "క్షమించాలి. నేను ఆ విషయం గురించి మాట్లాడాలనుకోవడం లేదు" అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడట.

గతంలో శ్రుతి, శాంతను వారి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఎప్పుడూ మొహమాటపడలేదు. పబ్లిక్‌గానే ఎంజాయ్ చేస్తూ రిలేషన్‌షిప్​ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేది. వారి క్లోజ్‌నెస్ చూసి, ఈ సంవత్సరం ఆరంభంలో శ్రుతి - శాంతనుకు వివాహం కూడా జరిగిపోయిందంటూ రూమర్లు వచ్చాయి. వాటిపై స్పందించిన శ్రుతి - "మేం పెళ్లి చేసుకోలేదు. నా గురించి ప్రతి విషయాన్ని బాహాటంగానే చెప్పాలనుకునే నేను, ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడతాను. వాస్తవం తెలియని వాళ్లు ఇలాంటి పుకార్లు పుట్టిచండం మానేసి మూసుకుని కూర్చోండి" అంటూ అప్పుడు ఘాటుగానే రిప్లై ఇచ్చింది. మరి ఏమైందో తెలియదు కానీ రీసెంట్‌గా శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో శాంతను ఉన్న పోస్టులన్నింటినీ డిలీట్ చేసేసింది. అంతేకాకుండా తాను పోస్టు చేసిన చివరి పోస్టులో "నా గురించి నేను తెలుసుకోవడానికి, మనుషుల గురించి అర్థం చేసుకోవడానికి నేను చేస్తున్న కొత్త ప్రయాణం" అని ఇన్ స్టాలో పోస్టు పెట్టింది. దీంతో అన్నింటిపై స్పందించే శ్రుతి ఈ సారి స్పందించకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ బ్రేకప్ గురించి చెబితే కారణం కూడా చెప్పాల్సి ఉంటుందేమోనని, అందుకే ప్రస్తుతాని సైలెంట్‌గా ఉండి ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. కానీ తర్వాత అయినా ఆమె కచ్చితంగా రీజన్​ చెబుతుందని అంతా అంటున్నారు. కాగా, వారిద్దరి మధ్య పర్సనల్ విబేధాలు రావడంతో ఎవరి దారి వాళ్లు చూసుకున్నారని గాసిప్స్​ చక్కర్లు కొడుతున్నాయి.

ఇకపోతే శాంతను ఫ్యామస్ డూడుల్, విజువల్ ఆర్టిస్ట్. చాలా మంది సెలబ్రిటీలతో కలిసి పనిచేశాడు. శ్రుతి హాసన్ విషయానికొస్తే కేవలం తన నటనతోనే కాకుండా డాన్స్, మూజిక్ రంగాల్లో తనదైన స్టైల్లో రాణిస్తూ మంచి ఇమేజ్ పొందారు. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ హాట్ హాట్ ఫొటోలతో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న శ్రుతి చివరిసారిగా తెలుగులో సలార్ చిత్రంలో నటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.700 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం అడవి శేష్​తో డెకాయిట్​, సలార్ 2, చెన్నై స్టోరీ అనే సినిమాల్లో నటిస్తోంది.

రెండో బాయ్​ఫ్రెండ్​తో శ్రుతి హాసన్​ బ్రేకప్​! - Shruti haasan Break up

ఈ వారం అందరి ఫోకస్​ ఆ 5 చిత్రాలపైనే! - This week Movie Releases

Last Updated : Apr 29, 2024, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.