ETV Bharat / entertainment

'వండర్ ఉమెన్' సమంత - ఫ్యాన్ మీట్​లో ఎమోషనలైన సిటాడెల్ బ్యూటీ! - Samantha Fan Meeting - SAMANTHA FAN MEETING

Samantha Fan Meeting : టాలీవుడ్ స్టార్ సమంత తన ఫ్యాన్స్​కు స్వీట్ సర్​ప్రైజ్ ఇచ్చారు. ఇటీవలే హైదరబాద్ వేదికగా ఏర్పాటు చేసిన ఓ ఫ్యాన్​ మీట్​లో పాల్గొని సందడి చేశారు. ఆ విశేషాలు మీ కోసం

Samantha Fan Meeting
Samantha Fan Meeting
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 3:35 PM IST

Samantha Fan Meeting : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు సౌత్​లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన నటనతో, అందంతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మయోసైటిస్​ కారణంగా సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. అయినప్పటికీ తన ఫ్యాన్స్ ఆమె రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆమె ఈ మధ్యలో 'సిటాడెల్'​ అనే వెబ్​సిరీస్​లో మెరిశారు. దీని కోసం ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రమోషన్స్​ ఈవెంట్​లోనూ సందడి చేశారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్​కు చేరుకున్నారు.

Samantha Fan Meeting
సమంత ఇన్​స్టాగ్రామ్ పోస్ట్

ఇక సామ్​ కోసం తన ఫ్యాన్స్ హైదరాబాద్​లో ఓ స్పెషల్ మీట్​ను అరేంజ్ చేశారు. అందులో పాల్గొన్న ఆమె తన ఫ్యాన్స్​తో ముచ్చటించారు. అంతే కాకుండా తన కోసం తయారు చేసిన 'వండర్ ఉమెన్​' కేక్​ను ఆమె కట్​ చేశారు. వాళ్లు చూపించిన అభిమానానికి ఎంతో ఎమోషనలయ్యారు. ఇక ఈ ఫోటోలన్నింటినీ సామ్ తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Samantha Fan Meeting
ఫ్యాన్స్​తో సమంత

మరోవైపు సమంత ప్రస్తుతం యాడ్ షూట్లతో పాటు ఫోటో షూట్లతో బిజీగా ఉన్నారు. . గతేడాది 'శాకుంతలం', 'ఖుషి' చిత్రాలతో పలకరించిన సమంత ప్రస్తుతం మరో ప్రాజెక్ట్‌ ఓకే చేయలేదు. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయాయి. అయితే ఆ తర్వాత బ్రేక్ తీసుకున్న సామ్ గత కొంత కాలంగా మయోసైటిస్​కు చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో అప్పటివరకు అంగీకరించిన ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మళ్లీ స్క్రీన్​పై కనిపించేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ఇంకా ఎటువంటి సినిమాల గురించి అనౌన్స్ చేయలేదు. అయితే ఆమె ఇటీవలే సొంతంగా ఓ పోడ్​కాస్ట్​ను స్ట్రీమ్ చేస్తున్నారు. అందులో తన పర్సనల్ లైఫ్​తో పాటు హెల్త్ గురించి మాట్లాడుతున్నారు. 'మై జర్నీ విత్ ఆటోఇమ్యూనిటీ' అనే పేరుతో ఇప్పటికే ఓ ఎపిసోడ్​ యూట్యూబ్‌లో విడుదలైంది. దీనికి నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఆ భ్రమలో బతికేశాను - అందుకు చాలా గిల్టీగా ఫీలయ్యాను : సమంత

సమంతను చూసి భయపడిపోయాను - తను అలాంటి వ్యక్తి! : సుహాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.