ETV Bharat / entertainment

ఆ ఒక్క కారణం వల్ల సల్మాన్ హీరోయిన్ సినిమాలకు దూరం! - ఏమైందంటే ? - Salman Khan Heroine Who Quit Movies

Salman Khan Heroine Who Quit Movies At Career Peak : కెరీర్​ తొలి రోజుల్లో సీరియల్స్​కు పరిమితమైన ఓ స్టార్, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించి బ్లాక్​బస్టర్ హిట్​ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే కెరీర్ పీక్స్​లో ఉన్న సమయంలో సినిమాలకు దూరమయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 7:35 PM IST

Updated : Mar 17, 2024, 8:55 PM IST

Salman Khan Heroine Who Quit Movies At Career Peak : బాలీవుడ్‌లోని టాప్ 3 స్టార్ హీరోల్లో ఒకరైన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో పాటు నటించి కూడా సినిమాలకు దూరమయ్యారు ఓ స్టార్ హీరోయిన్. ఒకానొక కాలంలో సల్మాన్ కంటే ఎక్కువ పారితోషకం కూడా అందుకున్నారు ఆమె. అయితే ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. ఇంతకీ ఆమె ఎవరు ? ఆమె సినిమాలకు ఎందుకు దూరమయ్యారంటే ?

'మైనే ప్యార్ కియా' అనే హిందీ సినిమాలో ఈమె నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉందరు. అంతలా ఆ క్యారెక్టర్​లో ఒదిగిపోయి నటించారు. ఆమెవరో కాదు అలనాటి అందాల తార భాగ్య శ్రీ. ఈ ఒక్క సినిమాతోనే బాలీవుడ్​లో స్టార్​డమ్ సంపాదించుకుని ఓ వెలుగు వెలిగారు. వాస్తవానికి ఆమె 1987లోనే 'కచ్చి ధూప్' అనే టెలివిజన్ సీరియల్​తో తన కెరీర్ స్టార్ట్ చేశారు. అందులో ఆమె యాక్టింగ్​కు మెచ్చిన డైరెక్టర్లు వరుస సినిమా ఆఫర్లను ఆమె ముందుంచ్చారు. తనకొచ్చిన ఛాన్స్​లను సద్వినియోగం చేసుకుని రాణించారు భాగ్య శ్రీ. అలా వచ్చిన 'మైనే ప్యార్ కియా' సినిమా ఒక్కసారిగా ఆమెను సూపర్ స్టార్ గా మార్చింది. 1989లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లోనే రూ.28 కోట్లకు పైగా వసూలు చేసింది. స్టార్టింగ్ సినిమాకే ఆమె సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారంటే ఆశ్చర్యకరమైన విషయమే.

ఆ కారణంగా 34 ఏళ్లుగా సినిమాలకు దూరం!

కెరీర్ పీక్స్​లో ఉన్న సమయంలో భాగ్య శ్రీ సినిమాలకు అనూహ్యంగా దూరమయ్యారు. ప్రేమ కోసం తన కెరీర్​ను పక్కకుపెట్టేశారు. తన చిన్ననాటి స్నేహితుడైన హిమాలయ దసానిని 1989లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో కనిపించినప్పటికీ చిన్నరోల్స్​కే పరిమితమయ్యారు. అయితే దాదాపు 34 ఏళ్ల తర్వాత ఈమె సల్మాన్ సరసన మరోసారి వెండితెర మీద మెరిశారు. 2023లో సల్మాన్ లీడ్​ రోల్​లో వచ్చిన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాలో ఈమె కనిపించారు. ఆమె వారసులు కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. తనయుడు అభిమన్యు బాలీవుడ్​ సినిమాల్లో మెరవగా, తనయ అవంతిక ఇటీవలే 'నేను స్టూడెంట్ సర్' అనే తెలుగు సినిమాతో పాటు రెండు హిందీ ప్రాజెక్టుల్లో నటించారు.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

5 సెకెన్లకు రూ. ఐదు కోట్లు - ఈ హీరోయిన్ డిమాండ్ మాములుగా లేదుగా

రాజమౌళి చెప్పిన ఆ ఒక్క మాట - ఇప్పటికీ పాటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్​!

Last Updated : Mar 17, 2024, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.