Real Story Based Movies: యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎప్పుడూ ప్రేక్షకులకు నచ్చుతాయి. ముఖ్యంగా దక్షిణాది సినిమాల విషయానికి వస్తే ఇక్కడి ప్రేక్షకులు బయోపిక్‌లు, రియాలిటీ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలను చూడటానికి ఇష్టపడతారు. నిజ జీవితం ఆధారంగా రూపొందించిన పలు సినిమాల గురించి చూద్దాం.
- తీరన్ అధిగారం ఒండ్రు(2017): దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్షన్ లో 'కమర్షియల్ పోలీస్' చిత్రాలకు కాస్త దూరంగా చాలా వాస్తవిక వివరాలతో, డాక్యుమెంటరీ రికార్డులతో కథను తెరకెక్కించారు. బెంగుళూరు-కుమ్మిడిపూండి-చెన్నై జాతీయ రహదారి వెంబడి ఇళ్లలో దోపిడీలు, హత్యలు చేసిన రాజస్థాన్ రాష్ట్రం హవారియా ముఠాను తమిళనాడు పోలీసులు చుట్టుముట్టిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఈ మూవీలో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.
- అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (2024): ఈ సినిమా కథ 2007 లో సాగుతుంది. అంబాజీపేట గ్రామానికి చెందిన మల్లి, పద్మ కవలలు. మల్లీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో పనిచేస్తాడు. పద్మ ఆ ఊరి స్కూల్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. అంటరానితనం, కులవివక్ష నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సామాజిక వ్యత్యాసాలు, వ్యక్తిగత సవాళ్ల ద్వారా నావిగేట్ చేస్తారు. వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ ఈ సినిమాను రూపొందించారు.
- కిల్లింగ్ వీరప్పన్ (2016): ఈ సినిమా బందిపోటు వీరప్పన్ నిజ జీవితంగా ఆధారంగా రూపొందించారు. వీరప్పన్ను పట్టుకునేందుకు జరిగిన ఆపరేషన్ గ్రిప్పింగ్ కథనంతో చాలా చక్కగా తీశారు. ఈ సినిమాను సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. 2016లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.
- విరాటపర్వం(2022): విరాటపర్వం సినిమా ప్రేమ, భావజాలం నడిచే కథతో రూపొందించారు. నక్సలైట్ ఉద్యమంలోకి ఒక మహిళ ప్రయాణం ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్ళకు అద్దం పడుతుంది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి, సాయిపల్లవి, నందితా దాస్ నటించారు.
- వికృతి (2019): ఆన్ లైన్ లో తప్పుదోవ పట్టించే పోస్టు ద్వారా నలిగిపోయే జీవిత కథ ఆధారంగా రూపొందించారు. చెవుడు, మూగ వ్యక్తి అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెను చూసుకుంటూ రెండు రాత్రుళ్లు మెలకువ ఉంటాడు. ఆ తర్వాత కాసేపు మెట్రోలో నిద్రిస్తుంటాడు. మరో ప్రయాణికుడు అతని ఫొటో తీసి ఇంటర్నెట్లో పోస్టు చేస్తాడు. ఈ పోస్టు ద్వారా అతని జీవితం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో చక్కగా చూపించారు. ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు, అతని కొడుకుగా బాసిల్, అతని భార్యగా సురభి లక్ష్మీ నటించారు.
- విసరనై (2015): సామాన్యులు తమ జీవితంలో చూడకూడదనుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. వలస కార్మికులపై పోలీసుల అనుచిత ప్రవర్తన, వారిని స్మగ్లర్లుగా చిత్రీకరించి హింసించే తీరు, పోలీసుల దుర్మార్గపు చర్యలను దర్శకుడు వెట్రిమారన్ చక్కగా చూపించారు.
- ట్రాఫిక్ ( 2011): దేశాన్ని ఆకర్షించిన నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. గుండెను తరలించేందుకు ట్రాఫిక్ పోలీసులు..ట్రాఫిక్ ను క్లియర్ చేయడంలో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఇందులో చూపించారు. ఈ సినిమా హిందీలో మనోజ్ బాజ్ పేయి హీరోగా రీమేక్ అయ్యింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దేవర భార్య - మరాఠీ బ్యూటీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? - shrumarathe Devara