ETV Bharat / entertainment

RC16 హీరోయిన్ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేసింది - చరణ్ సరసన ఎవరంటే? - ఆర్​సీ 16 హీరోయిన్ జాన్వీ కపూర్

RC16 Heroine : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అనే సస్పెన్స్​కు తెర పడింది. ఆ వివరాలు

RC16 హీరోయిన్ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేసింది - చరణ్ సరసన ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 9:51 AM IST

Updated : Mar 6, 2024, 11:20 AM IST

RC16 Heroine : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అనే సస్పెన్స్​కు తెర పడింది. రామ్ చరణ్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు మూవీటీమ్​ అఫీషియల్​గా అనౌన్స్​మెంట్ చేసింది. నేడు ఆమె పుట్టినరోజు(Happy Birthday Janvi Kapoor) సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ స్పెషల్ విషెస్ తెలిపింది. వాస్తవానికి ఈ మధ్యే జాన్వీ తండ్రి, నిర్మాత బోణీ కపూర్ కూడా ఈ విషయాన్ని తెలిపారు. కాకపోతే ఇప్పుడు మూవీటీమ్​ స్వయంగా అధికారికంగా తెలిపింది. దీంతో ఇది జాన్వీకి రెండో తెలుగు సినిమా కానుంది.

ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. స్పోర్ట్స్‌ డ్రామా బ్యాక్​డ్రాప్​తో గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగనుందని అంటున్నారు. మూవీలో రామ్‌ చరణ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అలానే వికలాంగుడిగానూ కనిపిస్తారని అంటున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహమాన్ స్వరాలు సమకూర్చనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి సినిమాను భారీగా నిర్మిస్తున్నాయి. గేమ్‌ ఛేంజర్‌ కంప్లీట్ తర్వాత రామ్‌ చరణ్‌ ఈ సినిమా మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. మే నెలలో షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. ఇంకా ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్​కుమార్​ కూడా నటిస్తున్నారు.

Devara Heroine JanviKapoor : ఇక ఆర్సీ 16తో పాటు టాలీవుడ్​లో యంగ్ టైగర్ చేస్తున్న దేవర చిత్రంలోనూ నటిస్తోంది జాన్వీ కపూర్. ఈ చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఆమెకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. ఇందులో పల్లెటూరి యువతిలో బాగా ఆకట్టుకుంది జాన్వీ. సెప్టెంబర్(Devara release date) ఈ సీ బ్యాక్​డ్రాప్​ మూవీ థియేటర్లలో రిలీజ్​ కానుంది.

జాన్వీ ఆ విషయంలో అస్సలు కంట్రోల్​ చేసుకోలేదట - ఈ సీక్రెట్​ మీకు తెలుసా?

ఓటీటీలోకి బాలయ్య బ్యూటీ హనీ రోజ్ రియల్ స్టోరీ మూవీ! - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Last Updated : Mar 6, 2024, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.