ETV Bharat / entertainment

RC 16 పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా - వేడుకలో స్పెషల్ అట్రాక్షన్​గా జాన్వీ

RC 16 Shooting : మెగా పవర్ స్టార్​ రామ్ చరణ్ - బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రం ఎట్టకేలకు సెట్స్​పైకి వెళ్లింది. ఇప్పటివరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

RC 16 పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా - వేడుకలో స్పెషల్ అట్రాక్షన్​గా జాన్వీ
RC 16 పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా - వేడుకలో స్పెషల్ అట్రాక్షన్​గా జాన్వీ
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 11:57 AM IST

Updated : Mar 20, 2024, 1:39 PM IST

RC 16 Shooting : మెగా పవర్ స్టార్​ రామ్ చరణ్ - బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రం ఎట్టకేలకు సెట్స్​పైకి వెళ్లింది. ఇప్పటివరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో జాన్వీకపూర్, రామ్​ చరణ్ భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ వేడుకలో హీరోయిన్‌గా నటిస్తోన్న బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. తన లుక్స్​తో చూపరులను బాగా ఆకట్టుకుంది. ఆకుపచ్చ రంగు లెహంగాలో మెరిసిపోయింది.

ఇంకా ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు, మూవీ యూనిట్ కూడా పాల్గొంది. చరణ్ భార్య ఉపాసన, మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శంకర్, బోనీ కపూర్, ఏఆర్ రెహమాన్, సుకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాను సుకుమార్ రైటింట్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ కలిసి నిర్మిస్తున్నాయి. కిలారు వెంకట సతీశ్​ ఈ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సమకూర్చుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్​డ్రాప్​తో ఈ సినిమా రాబోతుందని అంటున్నారు. కబడ్డీ లేదా ఫుట్​బాల్​ బ్యాక్​డ్రాప్​ అని చెబుతున్నారు. ఇందులో రామ్​ చరణ్​ ఎప్పుడూ చేయని సరికొత్త పాత్ర పోషించబోతున్నట్లు బయట కథనాలు కనిపిస్తున్నాయి.

ఇకపోతే ఇంకా ఈ చిత్రంతో పాటు రామ్​ చరణ్​ ప్రస్తుతం కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్​ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్​లో నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. సెప్టెంబర్ అని అంటున్నారు. ఈ చిత్రంలో రామ్​చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. సమకాలీన రాజకీయాలతో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుకోతంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్న దేవర సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనుంది. కొరటాల శివ డైరెక్షన్​లో తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్​లో రిలీజ్ కానుంది.

ప్రభాస్ ఇన్నేళ్ల పాటు పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణమిదా?

సుహాస్​కు సూపర్ ఛాన్స్​ - కీర్తి సురేశ్​ పక్కన హీరోగా సినిమా

Last Updated : Mar 20, 2024, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.