Rashmika Mandanna The Girlfriend Teaser : నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్'. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఓ డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా మేకర్స్ ఈ టీజర్‌ను విడుదల చేశారు. విజయ్ దేవరకొండ కవితతో ప్రారంభమైన ఈ టీజర్ ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
టీజర్లో హైలైట్స్ అవే!
"నయనం నయనం కలిసే తరుణం, యదనం పరుగే పెరిగే వేగం, నా కదిలే మనసుని అడిగా సాయం, ఇకమీదట నువ్వే దానికి గమ్యం" అంటూ విజయ్ దేవరకొండ వాయిస్‌ఓవర్‌తో ఈ టీజర్ మొదలువుతుంది. ఆ తర్వాత కాలేజ్, క్యాంటీన్, క్లాస్రూమ్ ఇలాగ పలు బ్యాక్‌డ్రాప్ ఉన్న షాట్స్‌లో రష్మిక కనిపిస్తుంది. అయితే టీజర్ చూస్తున్నంత సేపు ఇది మునుపెన్నడూ చూడని విధంగా ఓ కొత్త కథలా ఉంటుందని ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే ఆయన తన సంగీతంతో మ్యాజిక్ చేయనున్నట్లు అభిమానులు అంటున్నారు.
ఇక రష్మిక ఓ కాలేజ్ అమ్మాయి తరహాలో చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో ఆమె డిఫరెంట్ ఎమోషన్స్‌ను పండించేలా తెలుస్తోంది. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇదివరకే చిలసౌ అనే సినిమాతో అభిమానులను అలరించగా, ఇప్పుడు ఈ సినిమాతో మరో కొత్త జానర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది.
ఇక రష్మిక ప్రస్తుతం 'పుష్ప 2' సక్సెస్‌ను ఆస్వాదిస్తోంది. పాన్ఇండియా లెవెల్లో తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అలాగే రష్మిక యాక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా మంచి టాక్‌తో రన్ అవుతోంది.
'శ్రీ వల్లి క్యారెక్టర్ కోసం బాగా రీసెర్చ్ చేశా' - 'పుష్ప' లుక్ టెస్ట్‌లో రష్మిక ఎలా ఉందో చూశారా?
'ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా?' - రష్మిక సమాధానానికి దద్దరిల్లిన ఆడిటోరియం!