ETV Bharat / entertainment

సినిమాకు ఓకే చెప్పే విషయంలో రష్మిక ఏం చూస్తారంటే ? - రష్మిక మందన్న ఇంటర్వ్యూ

Rashmika Mandanna Interview : తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నేషనల్ క్రష్​ రష్మిక మందన్న. 'యానిమల్​'తో మాసివ్ సక్సెస్ అందుకున్న ఈ చిన్నది వరుస సినిమాలతో తీరిక లేకుండా బిజీ షెడ్యూల్స్​ గడుపుతోంది. తాజాగా క్రంచీ రోల్స్ యానిమీ అవార్డ్స్​ ఫంక్షన్​కు హాజరైన ఆమె తన మనలోని విషయాన్ని బయటపెట్టింది.

Rashmika Mandanna Interview
Rashmika Mandanna Interview
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 6:59 AM IST

Rashmika Mandanna Interview : నేషనల్ క్రష్​ రష్మిక మందన్న ఇప్పుడు గ్లోబల్​వైడ్ ఫ్యాన్స్ సంపాదించుకుని కెరీర్​లో దూసుకెళ్తోంది. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు స్పెషల్ ఈవెంట్స్​లో సందడి చేస్తోంది. ఇటీవలే జపాన్‌లోని టోక్యో వేదికగా జరిగిన క్రంచీ రోల్‌ యానిమి అవార్డుల ఫంక్షన్​కు హాజరైంది రష్మిక. భారత్​కు ప్రాతినిథ్యం వహించేందుకు వెళ్లిన ఆమెకు అక్కడి ఫ్యాన్స్ సర్​ప్రైజ్​ వెల్​కమ్​ కూడా చెప్పారు.

ఇదిలా ఉండగా ఈ అవార్డు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచిన రష్మిక అక్కడ జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని యాంకర్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్​లో సమాధానం చెప్పింది. తన అప్​కమింగ్ మూవీస్​ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.

"నేను స్టోరీలకు ఓకే చెప్పే విషయంలో ఆచితూచి అడుగులేస్తుంటాను. ఒక ప్రాజెక్టును ఎంచుకునే సమయంలో రెండు విధాలుగా ఆలోచిస్తాను. మొదటిది సినిమాలోని కథ మొత్తం నా చుట్టూనే తిరుగుతూ ఉండాలని అనుకుంటాను. రెండోది సినిమా రూపంలో ఆడియెన్స్​ను చెప్పాలనుకున్న కథ ఓ మెసేజ్​ ఇచ్చేలా ఉండాలి. త్వరలో రానున్న 'రెయిన్‌ బో', 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' సినిమాలు కూడా అలాంటివే. ఈ రెండూ కూడా హీరోయిన్ ఓరియెంటడ్ సినిమాలే. అంతేకాకుండా అన్ని సినిమాలు మెసేజ్​ ఓరియెంటడ్​గా ఉండాల్సిన అవసరం కూడా లేదు" అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇదే వేదికపై రొమాంటిక్‌ సినిమాల్లో నటించాలని ఉందంటూ తన మనసులోని మాట బయటపెట్టింది రష్మిక.

"ప్రస్తుతం నేను యాక్షన్‌ డ్రామా చిత్రాలు ఎక్కువగా చేస్తున్నాను. కానీ నాకు రొమాంటిక్‌ లవ్​ స్టోరీస్​లో నటించాలనే బలమైన కోరిక ఉంది. కాబట్టి నేను రొమాంటిక్‌ స్క్రిప్ట్‌ల కోసం ప్రయత్నిస్తున్నాను. అలాంటి రోల్స్​ నా దగ్గరికి ఎప్పుడు వస్తాయా అంటూ ఎదురుచూస్తున్నాను" అంటూ తన అప్​కమింగ్ మూవీస్ విషయాలను షేర్ చేసుకుంది.

Rashmika Upcoming Movies : ఇక రష్మిక మూవీస్​ విషయానికి వస్తే- రష్మిక ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు ధనుశ్ నాగార్జున కాంబోలో తెరకెక్కుతున్న 'డీ 51' సినిమాలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలు రెండూ శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్నాయి.

ఇక 'పుష్ప' ఈ ఏడాది ఆగస్ట్​ 15 థియేటర్లలోకి రానుండగా, ధనుశ్​ మూవీ మాత్రం తమ సినిమా టైటిల్​తో పాటు ఈ చిత్రం గురించి మరిన్ని అప్​డేట్స్​ ఇవ్వాల్సి ఉంది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కిస్తున్న 'ఛావా' అనే సినిమాలో మెరిసింది. విక్కీ కౌశల్‌ సరసన ఆమె నటించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవితాధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

జపాన్​లో రష్మికకు గ్రాండ్ వెల్​కమ్ - ఫ్యాన్స్​ స్పెషల్​ సర్​ప్రైజ్​

' షూటింగ్స్ కోసం రాత్రులు ప్రయాణించాలి - అందుకే సెలబ్రేట్​ చేసుకోలేకపోయా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.